ఏపీలో రాజకీయ పరిణామాలు చిత్ర విచిత్రంగా ఆసక్తికరంగా మారాయి. కేంద్ర అధికార పార్టీ బిజెపి మద్దతు పొందేందుకు అన్ని పార్టీలు విడివిడిగా ప్రయత్నాలు చేస్తునే ఉన్నాయి. ఎవరికి వారు బీజేపీ దృష్టిలో పడేందుకు, వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ విషయంలో ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముందడుగు వేసి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అయితే ఆయనను బిజెపి కేంద్ర పెద్దలెవరుపెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదని, అసలు పొత్తు పెట్టుకున్న పవన్ కు సంతోషమే లేదనే గుసగుసలు అప్పుడే మొదలయ్యాయి. అయితే ప్రధానంగా వైసిపి, టిడిపి ఈ రెండు పార్టీలు బిజెపి మద్దతు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.


 వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి తాము అన్ని వ్యవహారాలు బిజెపి కి చేస్తున్నామని, కేంద్ర పెద్దల అనుమతి లేకుండా తాము ఏమి చేయడం లేదు అన్నట్టుగా మాట్లాడి... మా వెనుక బీజేపీ ఉందనే సంకేతాలు ఇచ్చారు. జనాలు కూడా వైసిపి ఈ రేంజ్లో దూకుడు ప్రదర్శించడం చూస్తుంటే వైసీపీ వెనుక కేంద్రం హస్తం తప్పకుండా ఉండే ఉంటుంది అనే భావనకు వచ్చేశాయి. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా బిజెపి మద్దతు కోసం, ఆ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికీ బిజెపిలో చేరిన రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్, సుజనా చౌదరి తదితర నాయకుల ద్వారా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు మంతనాలు చేస్తున్నారు. 


ఈ దశలో మోదీ, అమిత్ షా ఎవరి వైపు మొగ్గుచూపుతారు ? ఎవరికి మద్దతుగా నిలబడతారు అనే అంశం ఎటూ తేలకుండా వస్తోంది. అయితే తాజాగా శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ లో వైసీపీ తీర్మానం చేయడంతో.. మూడు నెలల్లో దీనిని ఆమోదించుకోవాలని జగన్ చూస్తున్నారు. ఇక చంద్రబాబు ఆ బిల్లుని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఆపాలని ప్రయత్నాలు చేస్తున్నారు. బిజెపి ఈ బిల్లుకు మద్దతుగా నిలబడి శాసనమండలిని రద్దు చేసేందుకు ఒప్పుకుంటే, ఆ పార్టీ జగన్ కు మద్దతు గా ఉందని, ఒకవేళ అడ్డుకుంటే చంద్రబాబుకు మద్దతుగా ఉంది అనే విషయం క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టు ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు.ఇందులో ఎవరి వాదన నిజం అవుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: