ఇటీవల జనసేన అధినేత పవన్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ఆ దిశగా రెండు పార్టీలు పని చేయబోతున్నట్లు పొత్తులు పెట్టుకున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలపడం జరిగింది. అయితే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని రెండు తెలుగు రాష్ట్రాలలో ను మరియు ఢిల్లీలోనూ తనదైన శైలిలో చక్రం తిప్పేందుకు రెడీ అయిన పవన్ కి బీజేపీ పార్టీ పెద్దల నుండి సరైన రెస్పాండ్ రావటం లేదని ఏపీ బీజేపీ పార్టీలో వార్తలు వినపడుతున్నాయి. ప్రధాని మోడీ మరియు అమిత్ షా అపాయింట్మెంట్ కోసం పవన్ కళ్యాణ్ చాలాసార్లు పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా ట్రై చేసినా కానీ ఆ ఇద్దరు నాయకులు పవన్ కళ్యాణ్ లైట్ గా తీసుకుంటున్నారట.

 

దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిజెపి పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పరిస్థితి తెలుసుకుని పాపం పవన్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క ఏపీ బీజేపీ లో ఉన్న కొంతమంది నేతలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏజెంట్ అని చంద్రబాబు కోవర్టుగా బీజేపీలో పనిచేస్తున్నారని చాలా బలంగా ఢిల్లీలో ఉన్న బిజెపి నేతలకు తెలియజేస్తున్నారు అంట దీంతో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ పెద్దల అపాయింట్మెంట్ విషయంలో మధ్యలో ఉన్న కొంత మంది బీజేపీ నేతలు టార్చర్ పెడుతూ కనీసం అపాయింట్మెంట్ దక్కకుండా అడ్డుకున్నట్లు సమాచారం.

 

ఇందు మూలంగానే రాజధాని అమరావతి విషయంలో లాంగ్ మార్చ్ చేద్దామని ముందు డిసైడ్ అయిన పవన్... మోడీ- అమిత్ షా అపాయింట్మెంట్లు దొరక్కపోవడంతో వెనక్కి తగ్గినట్లు...ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు  వార్తలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఏపీలో జగన్ ప్రభుత్వానికి బీజేపీ పార్టీ పెద్దలు కూడా ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నట్లు ఇందు మూలంగానే జగన్ శాసనమండలిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వానికి జగన్ పంపినట్లు వార్తలు బలంగా నమ్ముతున్నారట పవన్.  

మరింత సమాచారం తెలుసుకోండి: