జగన్‌సర్కారు డీజిల్‌, పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2పెంచిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ ఆర్టీసీఛార్జీలు, మద్యంధరలు, విద్యుత్‌ఛార్జీలు, ఇసుకధరను 300 శాతం వరకు పెంచిందని, తాజాగా చమురుపై భారంమోపిందని కళా వెంకట్రావు పేర్కొన్నారు.  చమురు ధరలపెరుగుదలవల్ల అంతిమంగా సామాన్యుడికి, మధ్యతరగతివారిపైనే భారం పడుతోం దన్నారు. విద్యుత్‌ఛార్జీల పెంపువల్ల రూ.1500కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన జగన్‌, మద్యంధరల పెంపుద్వారా కూలీనాలీ చేసుకుంటూ జీవనంసాగించే పేదలరక్తాన్ని రూ.1800 కోట్ల రూపంలో  ప్రభుత్వం పీల్చివేస్తోందన్నారు. 

 

చమురుధరలపెంపువల్ల రూ.500కోట్లు, ఇసుకధర 300శాతం వరకు పెంచడంవల్ల, చాలాప్రాంతాల్లో ట్రక్కు ఇసుకధర రూ.5 నుంచి 6వేలకు పైగానే ఉందని, నదీపక్కనుండే ప్రాంతాల్లోనే రూ.3500వరకు అమ్ముతున్నారని, ఇసుక అందుబాటులో లేక, 40లక్షలకు పైగా కార్మికుల కుటుంబాలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. పెంచిన చమురుధరలను తక్షణమేవెనక్కు తీసుకోవాలని టీడీపీ తరుపున డిమాండ్‌చేస్తున్నట్లు కళా తెలిపారు. ఏడునెలల్లో 28 సంక్షేమపథకాలను జగన్‌సర్కారు రద్దుచేసిందని, పథకాలను రద్దుచేస్తూ, పన్నులభారం ప్రజలపై మోపడం ఇప్పుడే చూస్తున్నామన్నారు. 

 

విద్యారంగానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఈ8నెలల్లో ఒక్కశాతం కూడా ఖర్చుచేయలేదన్నారు. వైద్యరంగం లో ప్రభుత్వాసుపత్రుల్లో మౌలికసదుపాయాల కోసం రూ.75లక్షలు ఖర్చయితే, సీఎం ఇంటిని బాగుచేయడానికి రూ.30 కోట్లుఖర్చు చేశారని మాజీమంత్రి పేర్కొన్నారు. ప్రతిశుక్రవారం కోర్టుకి వెళ్లడానికి ఆర్థిక కారణాలు సాకుగా చూపుతున్న ముఖ్యమంత్రి, ప్రజలపై భారంమోపుతూ వారి ఆర్థికబలాన్ని దెబ్బతీస్తున్నాడని కళా మండిపడ్డారు. తాను అధికారంలోకొస్తే, రేట్లు పెంచనని, రాజన్న రాజ్యాన్ని తెస్తాను, నవరత్నాలు ఇస్తానని చెప్పిన జగన్‌, రాష్ట్రప్రజల్ని పన్నులభారంతో కుంగదీస్తున్నాడన్నారు. జగన్‌ చర్యలు చూస్తుంటే ఉన్న నాలుకకు మందువేస్తానని చెప్పి, కొండనాలుకను ఊడబెరికి నట్లుగా ఉన్నాయని కళా ఎద్దేవాచేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలపై ఒల్లమాలినప్రేమాభిమానాలు చూపిన జగన్‌, అధికారంలోకి రాగానే వారిని రాచిరంపాన పెడుతున్నాడని కళా పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు  ఒకలా, ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మౌలిక వసతుల కోసం 75 లక్షలు ఖర్చు పెట్టి, ఇంటికోసం రూ. 30 కోట్లు ఖర్చు చేశారని అయన మండిపడ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: