అఖిలపక్ష సమావేశంలో ముఖ్యంగా సిఏఏ బిల్లు ప్రవేశపెట్టాక రాష్ర్టంలోను, దేశంలోను మైనారిటీ సోదరులలో అనిశ్చితి నెలకొందని బుధవారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అన్నారు. కాబట్టి ఎన్ పి ఆర్ ,ఎన్ ఆర్ సి గాని తీసుకువస్తే మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలియ చేశారు. ఈరోజు అనిశ్చితి ఎందుకు నెలకొందని చెప్పారు. దీనిని ఎలా తొలగించాలని అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై చర్చకు కూడా పట్టుబట్టడం జరిగిందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

ఇదే విషయాన్నిపార్లమెంట్ వ్యవహారాల మంత్రికి చెప్పి చర్చకు అవకాశం ఇవ్వాలని కోరామని మిదున్ రెడ్డి పేర్కొన్నారు. మైనారిటి సోదరులలో నెలకొన్న అభధ్రతాభావాన్ని తొలగించాలని కోరామని ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి మైనారిటి సోదరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు. సిఏఏ అనేది బయట మూడు దేశాలకు సంబంధించిన అంశం ప్రాతిపదిక బిల్లుగా ప్రవేశపెట్టారని వివరించారు.

ఈరోజు చూస్తే దేశంలోని మైనారిటీ సోదరులందరికి అభధ్రతాభావానికి గురైన పరిస్దితి నెలకొని ఉందని చెప్పారు. కాబట్టి సిఏఏ ప్రవేశపెట్టిన తీరు వేరని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో బిల్లును అమలు పరుస్తున్న తీరు వేరని అన్నారు. ఈరోజు రకరకాల చర్యలు తీసుకునే పరిస్దితి దేశంలో నెలకొని ఉందని అన్నారు.

వాటికి మా పార్టీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. 2011 సెన్సస్ ప్రకారం కూడా జనాభా లెక్కలు ఉన్నాయని చెప్పారు.  దాని ప్రకారం కూడా చేయవచ్చని మిదున్ రెడ్డి తెలిపారు. తమ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పారని వెల్లడించారు. మైనారిటి సోదరులకు ఇబ్బంది కలిగించే అంశం దేనినైనా వ్యతిరేకించమని జగన్ చెప్పారని ఆయన స్పష్టం చేస్తున్నాను.

మరింత సమాచారం తెలుసుకోండి: