కరోనా వైరస్ ఇప్పుడు మహమ్మారిగా మారబోతుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు.  కరోనా వైరస్ ఇప్పటికే ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తోంది.  ఈ భయాల బారి నుంచి కాపాడేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు.  సామాన్యుల నుంచి కుబేరుల వరకు కూడా విరాళాలు అందిస్తున్నారు.  ఇప్పటి వరకు ఈ వైరస్ కు ఎలాంటి వ్యాక్సిన్ కనుగొనలేదు.  చైనా శాస్త్రవేత్తలు ఈ వ్యాక్సిన్ ను కనుగొనడానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.  ఎప్పటికి కనుగొంటారో తెలియడం లేదు.  


కానీ, ప్రయత్నాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటె, వ్యాక్సిన్ కోసం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అన్నింటిని తొలగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  దీనిపై పోరాటం చేయడానికి చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సిద్ధం అయ్యింది.  కరోనా వైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొంటున్న శాస్త్రవేత్తలకు 14 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందించారు.  అదే విధంగా వుహాన్ నగరాన్ని తిరిగి పునరుద్ధరణ కోసం మిలియన్ డాలర్ల ఆర్ధికం సహాయం అందించారు.  


ఇక ఇదిలా ఉంటె బిల్ గేట్స్ కూడా తన వంతు సహాయంగా వ్యాక్సిన్ పరిశోధన కోసం 10 మిలియన్ అమెరికన్ డాలర్లు సహాయం అందించారు.  వీరే కాదు ఫ్రెంచ్ కుబేరుడు బెర్నార్డ్ 2.3 మిలియన్ అమెరికన్ డాలర్ల సహాయం అందించారు.  ఇకపోతే చైనాకు చెందిన బైడు, టెన్సెన్ట్, బైట్ డ్యాన్స్ సంస్థలు సంయుక్తంగా 115 మిలియన్ డాలర్లు ప్రకటించాయి.  ఇకపోతే చైనా ఆర్థికశాఖ 3.94 బిలియన్ డాలర్లను ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి అందించింది. 

 

ఇక ఇదిలా ఉంటె, చైనాలో ఈ వైరస్ బారిన పడిన వ్యక్తులు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.  ఇప్పటికే 8000 మందికి ఈ వైరస్ సోకింగ్.  ఈ వైరస్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు.  దాదాపుగా 170 మందికి పైగా మరణించారు.  ఈ మరణాల సంఖ్యా మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఈ వైరస్ మొత్తం 17 దేశాలకు వ్యాపించ్చినట్టు తెలుస్తోంది.  ఇండియాలో నిన్న తొలి కేసు నమోదైంది.  చైనా నుంచి వచ్చిన ఓ విద్యార్థికి ఈ వైరస్ సోకింది.  త్రిపుర కు చెందిన మనీర్ అనే వ్యక్తి ఇటీవలే ఈ వైరస్ కారణంగా మలేషియాలో మృతి చెందిన సంగతి తెలిసిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: