జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించని షాక్ ఇస్తూ నిన్నటి రోజున మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీకి రాజీనామా చేసిన విషయం అందరికి తెలిసిందే. పవన్ పై బలమైన ఆరోపణలు చేయకుండానే, సినిమాలో నటించడం నచ్చలేదన, పవన్ మాట తప్పారని జేడీ ప్రకటించారు. అయితే జనసేన కి రిజైన్ చేయడానికి ఇంతకంటే పెద్ద సమాధానం చెప్పాల్సిన వసరం లేదనేలా పవన్ ని ప్రజల ముందు చీప్ చేసి పారేశారు జేడీ. నిజమే పవన్ పై పెద్ద ఎత్తున విమర్శలు చేసి ఉండుంటే ఎలా ఉండేదో కానీ, అసలు విమర్శలు ఏమీ చేయకుండా జేడీ బాయ్ బాయ్ చెప్పేయడం పవన్ కి ఘోరమైన అవమానమనే చెప్పాలి. అయితే....

 

జేడీ రాజీనామా విషయంపై స్పందించిన పవన్ కళ్యాణ్ ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అంటూనే  నేను ప్రభుత్వం నుంచీ వేలకి వేలు జీతాలు తీసుకునే ఉద్యోగిని  కాను అంటూ జేడీ కి సుతిమెత్తగా చురకలు అంటించారు.  ఇక ఇక్కడితో  ఈ తతంగానికి తెరపడిపోయింది అనుకున్న సమయంలో జనసేన పార్టీ నుంచీ  మరొక కీలకనేత కూడా జేడీ బాటలోనే పవన్ కి ఘలక్ ఇవ్వడానికి  సిద్దంగా ఉన్నారనే టాక్ ఇప్పుడు జనసేన పార్టీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే జనసేనలో జేడీ ఎగ్జిట్ గుబులు రేపుతుంటే తాజాగా మరొక కీలక నేత కూడా జారిపోతారనే టాక్ రావడంతో జనసేన భవిష్యత్తు పై సందిగ్ధత నెలకొంది..

 

 

విశ్వసనీయ సమాచారం ప్రకారం...పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ కీలక నేత సైతం త్వరలో పార్టీని వీడనున్నారని తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఈ వార్త రాజకీయ వర్గాలలో చర్చకి వచ్చినా అనూహ్యంగా ముందుగా జేడీ రాజీనామా చేయడం జరిగిపోయింది. జేడీ రాజీనామాకే జనసేన ఉలిక్కిపడితే, ఇక సదరు కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్తే జనసేన పార్టీ కోలుకోవడం కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం రాజీనామా చేసిన జేడీ భవిష్యత్తు కార్యాచరణ చెప్పకపోయినా, రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్న మరొక నేత మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళాలో డిసైడ్ అయ్యిపోయారనే టాక్ రాజకీయవర్గాలలో జోరుగా వినిపిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: