కరోనా ఈ పేరు ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది.  పేరు వింటేనే జనాలు భయానికి గురవుతున్నారు.  బాబోయ్ అని పారిపోతున్నారు.  ఒక్క చైనాలోనే దాదాపుగా 8వేలమంది ఈ వైరస్ బారిన పడ్డారు.  వైరస్ ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు.  170 మందికి పైగా ప్రజలు మరణించారు.  ఇది క్రమంగా పక్కనున్న దేశాలకు కూడా పాకుతున్నది.  ఇప్పుడు వైరస్ దెబ్బకు ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు.  


ఇకపోతే, వైరస్ నుంచి వచ్చే ముప్పు ఎలా ఉండబోతుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.  ఇక ఇదిలా ఉంటె, కరోనా వైరస్ కు సంబంధించిన ఎలాంటి మెడిసిన్ కు కూడా ఇప్పటి వరకు కనుగొనలేదు.  ఆస్ట్రేలియా మాత్రం ఈ వైరస్ కు సంబంధించిన కొన్ని వివరాలను వెలువరించింది.  వైరస్ కు విరుగుడు కనుగొన్నట్టుగా చెప్తున్నది.  


అయితే, ఈ వైరస్ మాంసం విక్రయం వలన వస్తుందని అంటున్నారు.  కానీ, వైరస్ మాంసం వలన కాదని, ఇదొక బయో వైరస్ అనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇకపోతే, ఈ వైరస్ ధాటికి అటు మందుబాబులు సైతం కూడా ఇబ్బందులు పడుతున్నారు.  బ్రాండ్ తో సంబంధం లేకుండా బీర్ కు మంచి ఫాలోయింగ్ ఉంటుంది.  మందు కంటే బీర్ తాగేవాళ్ళు ఎక్కువ.  అందులోను కరోనా బీర్ అంటే పడిచచ్చిపోయే వాళ్ళు చాలామంది ఉంది.  


ఇది మెక్సికన్ బీర్.  ఈ బీర్ తాగాలంటే మందుబాబులు ఒకటికి నాలుగుసార్లు ఆలోచిస్తున్నారట.  ఎందుకైనా మంచిది అని పక్కన పెడుతున్నారు.  బీర్ మాత్రమే కాదు, చైనా ఉత్పత్తులు అన్నింటిని ఒక్కొక్కటిగా ప్రజలు పక్కన పెడుతున్నట్టు తెలుస్తోంది.  చౌకగా దొరికే ఈ వస్తువుల ద్వారా కూడా ఎక్కడ వైరస్ వ్యాపిస్తుందో అని భయపడిపోతున్నారు.  మొత్తానికి కరోనా ఎఫెక్ట్ ప్రజలపై విపరీతంగా ఉన్నది.  చూద్దాం ఏమౌతుందో.  

మరింత సమాచారం తెలుసుకోండి: