ఇటీవల కాలం భార్య భర్తలు ఎవరికీ వాళ్ళు ఎమునా తీరు అన్న చందంగా బతుకుతున్నారు. రోజా  నిర్వహిస్తున్న బహిరంగ పంచాయతీలు కూడా ఈ అంశంలో ఊతమిస్తున్నాయనే చెప్పాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓ గడుసు పెళ్ళాం తన పుట్టింటికి వెళ్ళుతూ.. తన పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో మీరే చదవండి తెలుసుంది.  పనిమనిషికి జీతం ఇచ్చేశాను. నేను ఊరి నుండి వచ్చేదాకా పనిమనిషి రాదు, నేను తిరిగొచ్చే వరకు వాళ్ళ అమ్మ పనిలోకి వస్తుంది. 10 రోజులు వైఫై ఆపెయ్యమని ప్రొవిడర్ కి చెప్పేశాను. పెందలాడే పడుకోండి. మీ హార్డ్ డిస్క్, కేబుల్ కోసం వెతక్కండి.

అది నాతో పాటు హాండ్ బాగ్ లోఉంది జాగ్రత్తగా. మీరు చాలా హెల్దీగా ఉన్నారు. మాటి మాటికి ఆ లేడి డాక్టర్ వద్ద చెకప్ కి వెళ్లవద్దు. మీ కోతి మూకని పోగు చేయకండి. సోఫాలో సిగిరేట్ పొడిని పోయిన సారి క్లీన్ చేసుకోటానికి రెండు రోజులు పట్టింది. పిజ్జా బిల్లులు చాలా దొరికాయి. మీ మరదలు పుట్టినరోజు పోయిన నెలలోనే అయిపోయింది. మనిద్దరం వెళ్ళి వచ్చాం కూడా. అర్ధరాత్రి వెళ్ళి దానికి బిలేటెడ్ బర్త్ డే విషెష్  చెప్పాల్సిన పని లేదు.

మా మరిది కరాటే నేర్చుకుంటున్నాడట. అది మీకోసమే అని నా నమ్మకం. పక్కింటి వాళ్ళని పొద్దుటే లేపి పేపర్ వచ్చిందా, పాలు వచ్చాయా అని విసిగించకండి. అల్మారాలో కుడి వైపు మీ చడ్డీలు ఉన్నాయి. ఎడంవైపు ఉన్నవి పిల్లాడివి. ఆఫీసునుండి ఏదో ఇబ్బందిగా ఉంది

అని పోయిన సారి హడావిడి పెట్టారు గుర్తుందా? మొబైల్ ఫోన్ బాత్రూమ్ సోప్ బాక్స్ లో పెట్టి ఇల్లంతా రెండు రోజులు వెతికారు పోయినసారి. కళ్ళజోడు ఫ్రీడ్జ్ లో ఉండి పోయింది.మరి అంత ఎక్కువ స్మార్ట్ గా తయారవ్వకండి. మన వీధిలో ఉండే మిసెస్ స్వాతి, జ్యోతి, రాధిక ముగ్గురు ఊర్లో లేరు. షరా మామూలుగా నేను ఎప్పుడయినా తిరిగి వచ్చే అవకాశం ఉండనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: