ప్రభుత్వాలు మారాయి.. పాలకులు మారారు.. ఆయినా ఆ జిల్లాల వాసుల కష్టాలు మాత్రం గట్టెక్కడం లేదు. దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా సమస్యలు అపరిష్కృతంగా పేరుకుపోయాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న బడ్జెట్ లోను ఆ జిల్లాలకు నామమాత్రంగానే కేటాయింపులు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వెనకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్రాతిపదికన నిధులు కేటాయించాల్సి ఉంది. గతంలోనూ వెనకబడిన జిల్లాలకు కేటాయింపులు చేశారు. 


కానీ అవి కేటాయింపులకే పరిమితం కావడం.. నిధుల్ని ఆయా జిల్లాలకు విడుదల చేయకపోవడం వల్ల అవి మరింత వెనుకబడిన జిల్లాలుగా మారాయి. ఈ బడ్జెట్ లో నైనా వెనకబడిన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేస్తుందని అంతా భావించారు. కానీ గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలకు అనుకూలంగా వెనకబడిన జిల్లాలకు కేటాయింపులు మాత్రం ఆశించిన స్థాయిలో ఇవ్వకుండా నిరుత్సాహ పరిచారు అనే చెప్పాలి. దేశవ్యాప్తంగా వెనుకబడిన జిల్లాలను ప్రగతిపథంలో నడిపించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని గతంలో ప్రభుత్వాలు ఓ నిర్ణయానికి వచ్చాయి. 


కేవలం రాష్ట్ర ప్రభుత్వాల పైనే భారం వేయకుండా కేంద్రం కూడా తమ వంతుగా ఆయా వెనుకబడిన జిల్లాలలో అభివృద్ధి పధంలోకి తీసుకు వచ్చేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని భావించారు. అందుకు తగిన విధంగా కేటాయింపులు చేశారు. నిధుల విడుదల విషయానికి వచ్చే సరికి మాత్రం ఏ మాత్రం ఆశించిన స్థాయిలో కాకుండా తూతుమంత్రంగా అరకొర నిధులు విడుదల చేస్తున్నారు. ఫలితంగా ఆ నిధులు ఏ మూలకు సరిపోకపోవడంతో ప్రజలు కష్టాల సుడిగుండంలోనే తమ బతుకులను నెట్టుకొస్తున్నారు. మరోవైపు అభివృద్ధి జరిగిన జిల్లాల్లోనూ మరింతగా అభివృద్ధి చేస్తూ నాయకులు సైతం వివక్షతను జిల్లాలపై చూపుతున్నారనడంలో మాత్రం సందేహం లేదు. మరి ఈసారి బడ్జెట్ లో నైనా వెనకబడిన జిల్లాలకు కేటాయింపులు ఆశించిన స్థాయిలో ఉంటాయో లేదో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: