ప్రతిష్టాత్మకమైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ త్వరలోనే మూతపడనుందా.. అంటే పరిస్థితులు అవుననే సమాధానం ఇస్తున్నాయి. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసేసి.. కొత్తగా మరో భారీ స్థాయి ఫ్యాక్టరీని విశాఖపట్నం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. అయితే ఇది విదేశీ కంపెనీని తీసుకొచ్చేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మూసివేసి ఉన్నట్లుగా ప్రచారం సాగుతోండడంతోస్థానికులల్లో కలవరం మొదలైంది. దీనికి బలం చేకూరుస్తూ తెలుగు సినీ నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాకు చెందిన ఐరన్ కంపెనీ పోస్కోను విశాఖలో స్థాపించేందుకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మూసివేసేందుకు రంగం సిద్ధం చేసినట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగానే ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సమావేశమయ్యారని పేర్కొన్నారు. 

 

ఈ భేటీ మర్యాదపూర్వకంగా అని బయటకి చెబుతున్నా.. దాని వెనుక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కి సంబంధించిన ఒప్పందం దాగి ఉందని ఆయన తెలిపారు. అయితే ఏది ఎలా ఉన్నా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మూతపడితే అందులోని ఉన్న 40 వేల మంది ఉద్యోగులు.. మరోవైపు ప్రత్యక్షంగా పరోక్షంగా దాని పై ఆధారపడిన లక్షలాది మంది తమ ఉపాధిని కోల్పోయే ప్రమాదం పొంచి ఉంది. దీనికితోడు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ స్థాపించిన సమయంలో అక్కడి రైతులు 60 వేల ఎకరాల పంట భూములను ధారాదత్తం చేశారని, దానికి ప్రతిఫలంగా రైతులకు కేవలం 150 గజాల స్థలాన్ని మాత్రమే ఇచ్చారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. అయితే ఈ వ్యవహారం అంతటినీ ఢిల్లీ స్థాయిలో కీలక పదవిలో ఉన్న తెలుగు వ్యక్తి నడిపిస్తున్నారని ఆయన బాంబు పేల్చారు.

 

ఆ వ్యక్తి ఎవరో తనకు తెలుసని కాకపోతే ఇప్పుడు ఆ పేరును చెప్పబోనని హీరో శివాజీ చెప్పారు. హీరో శివాజీ మరో కీలక వ్యాఖ్యలు సైతం చేశారు. విశాఖ పట్నం పై అపరిమితమైన ప్రేమను చూపిస్తున్న ఏపీ ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఏ విధంగా స్పందిస్తుందో చూడాలని ఆయన పేర్కొన్నారు. నిజంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ మూసివేస్తే అక్కడి రైతులకు ఎవరు మద్దతుగా నిలుస్తారో.. వేచిచూడాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: