ఫిబ్రవరి 1వ తేదీన చరిత్రలో కి వెళ్లి చూస్తే ఎంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఈ రోజు జన్మించిన ఆ ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి.

 

 వేల్చేరు నారాయణరావు జననం : ప్రముఖ తెలుగు సాహిత్య విమర్శకుడు పరిశోధకుడు అనువాదకుడు అయినా వేల్చేరు నారాయణరావు 1933 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. 

 

 

 సుధాకర్ జననం : సుధాకర్ పేరు సినీ ప్రేక్షకులందరికీ కొసమెరుపు. తమిళ తెలుగు సినిమాలలో నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటుడు సుధాకర్. ఈయన 1956 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. ఆయన నిర్మాతగా ఎన్నో సినిమాలను నిర్మించారు కూడా. ఎన్నో సినిమాల్లో ప్రధాన నటుడిగా హాస్యనటుడిగా నటించి తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను అలరించాడు. తెలుగు భాషతో పాటు తమిళ కన్నడ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటించారు సుధాకర్. ఎంతో మంది ప్రముఖ హీరోలతో కూడా నటించి అవార్డులు రివార్డులను సైతం సొంతం చేసుకున్నారు. తనదైన డైలాగ్ డెలివరీతో హాస్య నటుడిగా ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. 

 

 

 హాస్యబ్రహ్మ బ్రహ్మానందం జననం : ఎంతో ప్రఖ్యాతి చెందిన తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం 1956 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. తెలుగు తమిళంతో పాటు వివిధ భాషల్లో 1000 కి  పైగా సినిమాల్లో నటించి 2010లో గిన్నిస్ రికార్డు కూడా ఎక్కాడు బ్రహ్మానందం . భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం కూడా బ్రహ్మానందానికి ఇచ్చి గౌరవించింది. తనదైన డైలాగ్ డెలివరీతో చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు. ఉత్తమ హాస్యనటుడిగా 5 నంది పురస్కారాలు ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. ఇవే కాకుండా ఎన్నో అవార్డులను సైతం అందుకున్నారు బ్రహ్మానందం. ఎన్నో ఏళ్ల నుంచి హాస్యనటుడిగా తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న బ్రహ్మానందం ఇప్పటికీ అందరికీ ఫేవరెట్ హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. 

 

 

 గిరిబాబు జననం : తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులైన గిరిబాబు  1946 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. నాటి తరం ప్రేక్షకుల నుండి నేటి తరం ప్రేక్షకుల వరకు ఇప్పటికీ సినిమాల్లో అలరిస్తూనే ఉన్నారు గిరిబాబు . కాగా  తెలుగు చిత్రపరిశ్రమలో 700 సినిమాలకు పైగా నటించారు.పలు  సినిమాలకు దర్శకుడిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం గిరిబాబు కుమారుడు రఘుబాబు తెలుగు చిత్ర పరిశ్రమలు తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు . ఇక గిరిబాబు విలన్ గా కామెడీ విలన్గా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఎన్నో పాత్రలు తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. తనదైన నటనతో పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ  ఎన్నో అవార్డులు రివార్డులను  సొంతం చేసుకున్నారు గిరిబాబు. 

 

 జాకీష్రాప్ జననం : ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ 1957 ఫిబ్రవరి 1 వ తేదీన జన్మించారు. నాలుగు దశాబ్దాల పాటు స్టార్ యాక్టర్ గా  కొనసాగిన జాకీష్రాఫ్ ఏకంగా 220 సినిమాలకు పైగా నటించారు.ఏకంగా  పదకొండు భాషల్లో నటించారు జాకీ ష్రాఫ్ . ఇప్పటికీ ఎన్నో సినిమాలలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు  జాకీష్రాప్.

మరింత సమాచారం తెలుసుకోండి: