కేంద్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో మౌలిక వ‌స‌తుల ఏర్పాటుకు గ‌త బ‌డ్జెట్‌లో కేటాయించిన నిధులు స‌క్ర‌మంగా విడుద‌ల కాలేదు. మ‌రి ఇప్పుడు నిధుల కేటాయింపుపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఎన్నో ఆశ‌లు పెట్టుకోగా.. అవి కాస్త అడియాశలుగానే మిగిలినట్లున్నాయి. కేంద్రం ప్రతిసారి విడుదల చేసిన బడ్జెట్ లో భాగంగా మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాలు అనగా.. బాగా వెనుకబడిన ప్రాంతాలకు కొన్ని నిధులను ప్రత్యక్షంగా విడుదలచేయడం జరుగుతుంది. కానీ ఆయా నిధుల ఊసు ఊహాగానే మిగిలిపోతోంది.

 

మావోయిస్టుల ప్రభావానికి లోనుకాకుండా, సదరు ప్రాంతాల అభివృద్ధి కొరకు ఈ ప్రత్యేకమైన నిధులను వినియోగించాల్సి ఉంటుంది. సక్రమమైన రహదారులకు, మంచినీటి/తాగునీటి కార్యక్రమాలకు, విద్య, వైద్యం మరియు రైతుల బీడుభూముల ఉద్ధరణే లక్ష్యంగా ఆయా నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, బడ్జెట్ విడుదల చేసిన ప్రతిసారీ నిధుల కేటాయింపు ఖచ్చితంగా ఉంటుంది, కానీ నిధులు విడుదల మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది.

 

గతంలో.. ఖమ్మం జిల్లానుండి చత్తిస్ గఢ్ మరియు జగదల్ పూర్ వెళ్లే రహదారి అభివృద్ధి కొరకు, సదరు రహదారిని అనుసంధానం చేసే మార్గం కోసం కొన్ని నిధులు విడుదల అయినవి. అంతవరకు మాత్రం మనం అభివృద్ధిని చూడవచ్చు. ఆ తరువాత తెలంగాణాలో ఆదిలాబాద్, కొమరం భీం జిల్లా నుండి మహారాష్ట్రలో మావోయిస్టుల అడ్డాగా మారిన "గచ్చిరోలి" తో అనుసంధానం కొరకు గడిచిన రెండు బడ్జెట్ లలో నిధులు కేటాయిస్తామని చెప్పి, ఇవ్వకుండా మాట తప్పారు.

 

అలాగే ఆంధప్రదేశ్ మరియు తెలంగాణాలో ఉమ్మడి ఖమ్మం జిల్లా, వరంగల్, అటు ఆదిలాబాద్, కరీంనగర్ లో కొంత ప్రాంతం... ఇటు ఆంధ్రప్రదేశ్ లో తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో ప్రధానంగా మావోయిస్టుల ప్రాబల్యం చాలా ఎక్కువగా వుంది. ఇక చాలా ప్రాంతాలలో రహదారుల అభివృద్ధి కూడా అంతంతమాత్రంగానే వుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల మధ్యన కేంద్ర ప్రభుత్వం, కేవలం నిధుల కేటాయింపు మాత్రమే చేస్తుందా లేక, అవసరమైన మేరకు నిధులను విడుదల చేస్తుందా అనేది పెరుమాళ్ళకెరుక!

మరింత సమాచారం తెలుసుకోండి: