అధర్మం ఎన్నికుట్రలు, కుతంత్రాలుచేసినా అంతిమవిజయం ధర్మానిదేనని,  రాజధాని అమరావతిని విచ్ఛిన్నంచేసి, తమపబ్బం గడుపుకోవాలనుకుంటున్న ముఖ్యమంత్రి, వైసీపీప్రభుత్వ అనైతికచర్యలకు, ఆకృత్యాలకు పవిత్రమైన పదవిలోఉన్న వై.వీ.సుబ్బా రెడ్డిలాంటి వాళ్లు భాగస్వాములుకావడం సిగ్గుచేటని టీడీపీనేత, రాష్ట్రబ్రాహ్మణకార్పొరేషన్‌ మాజీఛైర్మన్‌ వేమూరిఆనంద్‌సూర్య మండిపడ్డారు. ప్రపంచప్రఖ్యాతిపొందిన తిరుమ ల తిరుపతి క్షేత్రం ఛైర్మన్‌గా ఉండాల్సిన వ్యక్తికి, శాసనమండలిలో గ్యాలరీలో ఏంపని అని వేమూరి ప్రశ్నించారు. 

 

స్వామివారి పాదాలచెంత సేవకుడిగా ఉండాల్సిన వై.వీ.  అసెంబ్లీ కారిడార్లలో, మండలి గ్యాలరీల్లో ఉండటం సిగ్గుచేటన్నారు. సుబ్బారెడ్డి దైవ సేవకుడా..లేక రాజకీయ దళారీనా అన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వం వింతపోకడలకు పోతుంటే, ధార్మికసంస్థకు అధిపతిగా ఉండాల్సిన వ్యక్తి మద్ధతుగా నిలవడం దుర్మార్గమని ఆనంద్‌సూర్య ఆగ్రహం వ్యక్తంచేశారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను కాపాడటం మానేసి, విజయవాడలో, విశాఖపట్నంలో భూముల క్ర యవిక్రయాల్లో, దందాల్లో దళారీగా వ్యవహరిస్తూ, కమీషన్లు తీసుకునేపనిలో సుబ్బారెడ్డి ఉన్నాడన్నారు. టీటీడీ ఛైర్మన్‌గా ఉండి, విశాఖలోని స్వరూపానందేంద్రపీఠంలో ఉంటూ,  భూదందాలు చేయడం ఆయనకే చెల్లిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలే చేయాలని  సుబ్బారెడ్డి భావిస్తే, ఆయన తక్షణమే టీటీడీఛైర్మన్‌ పదవికి రాజీనామాచేయాలని ఆనంద్‌సూర్య డిమాండ్‌చేశారు.

 

అర్చకుల సంక్షేమనిధి నిధులైన రూ.234కోట్లను వారి సంక్షేమానికి వినియోగించకుం డా వైసీపీప్రభుత్వం వాటిని దారిమళ్లించిందన్నారు. పేదబ్రాహ్మణులకు పింఛన్లు కూడా అందడంలేదని, బ్రాహ్మణకార్పొరేషన్‌ఛైర్మన్‌గా ఉన్న మల్లాది విష్ణు తక్షణమే ఈ అంశంపై జోక్యం చేసుకోవాలన్నారు. అర్చకులకు ఇస్తామన్న కనీసవేతనాన్ని కూడా వెంటనే అందించాలన్నారు. అర్చకులకు న్యాయంచేస్తామన్న ఉపసభాపతి కోన రఘుపతి ఆ సమస్యపై స్పందించాలని వేమూరి సూచించారు.

 

పక్కరాష్ట్రంలో కూర్చొని ట్విట్టర్‌వేదికగా స్పందిస్తున్న ఐ.వై.ఆర్‌.కృష్ణారావు బాధను తాము అర్థంచేసుకున్నామని, అక్కడుంటూ, ఏపీలోని హిందువులు, బ్రాహ్మణులు, అమరావతి గురించి మాట్లాడుతున్న ఐ.వై.ఆర్‌, ఇప్పటికైనా తనరెండునాల్కలధోరణి  విధానాన్ని మానుకోవాలన్నారు. ఆయనకు ఆంధ్రప్రజలపై, అమరావతిపై అంతప్రేమే ఉంటే, తక్షణమే ఈగడ్డపైకి వచ్చి, హిందువులు, పీఠాధిపతులుచేసే యజ్ఞయాగాదుల్లో పాల్గొని, రాజధానికి తనవంతు సంఘీభావాన్ని ప్రకటించాలని వేమూరి సూచించారు.  

  

రాష్ట్రప్రభుత్వం హిందువులకు, అర్చకులకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న పదవుల్లో ఉన్న మల్లాదివిష్ణు, కోనరఘుపతి, పదవికోసం పాకులాడుతున్న ఐ.వై.ఆర్‌లు   ఎందుకు మాట్లాడటంలేదన్నారు. వారికి ఏమాత్రం బ్రాహ్మణుల, అర్చకులసంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్నా, ఆయావర్గాల సమస్యలపై, రాష్ట్రభవిష్యత్‌పై పాలకులతో చర్చించి, తమంతుగా పుట్టినగడ్డకు న్యాయం చేయాలని, అవసరమైతే తమపదవులకు రాజీనామా చేసేనాసరే రాజధానికోసం పోరాడాలని ఆనంద్‌సూర్య డిమాండ్‌చేశారు. బీజేపీనేతలు కూడా రాజకీయాలు పక్కనపెట్టి మూకుమ్మడిగా రాజధానికోసం పోరాడలన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: