గత ఏడేళ్లుగా నిర్భయ దోషులకు శిక్ష ఎప్పుడు పడుతోంది. అని అనుకుంటూ.. దేశ వ్యాప్తంగా అందరు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నిర్భయ నిందితులకు మళ్లీ ఉరిశిక్ష వాయిదా పడింది. ఇంతకు ముందు తీర్పు ప్రకారం నిర్భయ దోషులకు రేపు ఉదయం 6 గంటలకు తీహార్ జైలులో నలుగురు నిందితులను ఉరి తీయడానికి జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

 

అయితే ఈ నలుగురు దోషులు ఉరిశిక్ష పై స్టే ఇవ్వాలని ఢిల్లీ పాటియాల కోర్టును ఆశ్రయించారు. దీంతో వాదనలు విన్న న్యాయమూర్తి రేపు విధించే ఉరిశిక్ష పై స్టే విధించారు. తమ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు మరణ శిక్ష ను అమలు చేయకూడదని.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పోలీసులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని పాటియాల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఇప్పటికి ఈ నిర్భయ దోషులకు ముచ్చటగా మూడోసారి ఉరి వాయిదా పడుతూ వస్తుంది. ఈ వార్త విన్న నిర్భయ తల్లి ఆవేదన చెందింది.

 

కాగా., గత కొంత కాలంగా మరణ శిక్ష వాయిదా పడటానికి నిర్భయ నిందితులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. కోర్టు తీర్పు పై నిర్బయ తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. ఎందుకు తప్పు చేసిన దోషులను  పదే పదే కోర్టులు రక్షిస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నా కూతురుని అతి దారుణంగా చంపినా దోషులను నేను వదలమని వారికీ శిక్ష పడే వరకు నేను పోరాడతానని తెలిపారు.

 

ప్రభుత్వం, కోర్టులు కావాలనే నిందితులను కాపాడుతున్నాయని నిర్భయ తల్లి ఆరోపించింది. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నిర్భయ తల్లి స్పష్టం చేసింది. దోషులు ఏం కోరుకుంటున్నారో కోర్టుల్లో అదే జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాల్లో మార్పులు తీసుకురావల్సిన అవసరం ఉందన్నారు నిర్భయ తల్లి.

మరింత సమాచారం తెలుసుకోండి: