మహా నగరాల్లో వాయు కాలుష్యం వల్ల చాలామంది అనారోగ్యాలకు గురి అవుతున్నారు.. దానికి తగ్గట్టు శబ్ద కాలుష్యం కూడా... ఒకవైపు వాయు కాలుష్యం.. మరో వైపు శబ్ద కాలుష్యం వల్ల సాధారణ ప్రజలు ఇబ్బంది పాలుఅవుతున్నారు.. హైదరాబాద్‌ మరియు ముంబై లాంటి మహా నగరాల్లో ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉదయం విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు సిటీలో గంటలకొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడుతుంటారు. దుమ్ముధూళి, రణగొణ ధ్వనుల మధ్య నరకం చూస్తుంటారు.

 

ఇక సిగ్నళ్ల వద్ద పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. కొంచెం సేపు కూడా లైన్లో నుంచోలేక ఒక్కటే శబ్దం..
వెనకాల నుంచి హారన్‌ల మోత మోగుతుంది.ఒక పక్క లేట్ అవుతుందని కంగారు, హడావుడి లో హారన్ మోత ముగిస్తున్నారు.. రెడ్ సిగ్నల్ పడినా కొందరు వాహనదారులు హారన్ కొడుతూనే ఉంటారు. ఇప్పటికే వాహనాల నుంచి వెలువడే పొగతో వాయు కాలుష్యమవుతుండగా..దీనికి తోడు ఇలా పదే పదే హారన్‌లు కొట్టడంతో శబ్ధ కాలుష్యం కూడా అవుతోంది. ఈ సమస్యకు ముంబై పోలీసులు సరికొత్త ఐడియాతో చెక్ పెట్టారు.ముంబైలో సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులు డెసిబల్ మీటర్స్ ఏర్పాటు చేశారు. సిగ్నల్ పడ్డప్పుడు వాహనదారులు హారన్ కొడితే.. ఎంత ధ్వని వస్తుందో ఆ మీటర్‌లో నమోదవుతుంది. ఒకవేళ ఆ శబ్ధం 85 డెసిబల్స్ దాటిందో అంతే సంగతులు..!

 

రెడ్ సిగ్నల్ మళ్లీ మొదటి నుంచి ప్రారంభమవుతుంది. అలా సిగ్నళ్ల హారన్ మోత ఆగేవరకు, రెడ్ సిగ్నల్ పడుతూనే ఉంటుంది. Honk more..wait more.. ఎంత గట్టిగా హారన్ కొడితే.. అంత ఎక్కువ సేపు వెయిట్ చేయాలి అంట... ఇదేదో బాగుంది కదా అనుకుంటున్నారా... హారన్ మోత ఆగి.. రణగొణ ధ్వనులు తగ్గితేనే గ్రీన్ సిగ్నల్ పడి వాహనాలు వెళ్లేందుకు వీలుంటుంది.సిగ్నల్ వద్ద నిశ్శబ్ధంగా ఉంటేనే వాహనాలు ముందుకు వెళ్లేందుకు సాధ్యమవుతుందున్న మాట.ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫాలో అవుతున్న ఈ ఫార్ములాపై మంత్రి కేటీఆర్ ఆసక్తి కనబరిచారు.

 

హైదరాబాద్‌లోనూ ఇలాంటి విధానాన్ని అమలు చేస్తే ధ్వని కాలుష్యం అలానే వాయు కాలుష్యం రెండు కంట్రోల్ లో ఉంటాయని అభిప్రాయపడ్డారు. ముంబై పోలీసులు పోస్ట్ చేసిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు... అసలు హడావుడిగా కాకుండా కొంచెం ముందు బయలుదేరితే ఏ గోల ఉండదు కదా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: