సోషల్ మీడియా కు నేటి యువత బానిసలు అవుతున్నారు. వాటి మోజులో పడి మన చుట్టుపక్కల ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న మోసాలపై ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేసిన యువత మారడం లేదు. పనికి రాని వాటికి తమ సమయం కేటాయిస్తూ తమ అమూల్య సమయాన్ని వృధా చేయడమే కాకుండా, వాటికి బానిసలుగా మారుతున్నారు.

   

    సోషల్ మీడియా లో తమకు వచ్చే లైక్ లు కామెంట్ లను చూస్తూ మురిసిపోతున్న నేటి యువత, వాటి వెనకాల దాగి ఉన్న మోసాన్ని గుర్తించేలేక పోతున్నారు. వివరాల్లోకి వెళితే ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లోని  ఆగ్రాలో జరిగింది   ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన అబ్బాయితో, ఒక యువతీ దారుణంగా మోసపోయింది.

 

    హత్రాస్ జిల్లాకు చెందిన దర్శ్ గౌతమ్ అనే 23 ఏళ్ల యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో 20 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా  సదరు యువతితో మంచిగా ఉంటూ స్నేహం పెంచుకుమ్మాడు. ఓ రోజు గౌతమ్ ఫోన్ చేసి మాట్లాడుకుందాం రమ్మనడంతో యువతి అతనిని కలిసేందుకు వెళ్లింది. యువతిని హోటల్ కు  తీసుకెళ్లిన గౌతమ్ ఆమెను మీలాగా మాటల్లో దించి, కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మైకం వదిలిన తర్వాత  ఆమె జీవితాన్ని నాశనం చేసిన విషయం తెలుసుకున్న  యువతి పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ యువత ముఖ్యంగా యువతులు ఇటువంటి అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా వుండాలని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: