సీఎం జగన్ పై మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవి హత్య సమయంలో జగన్ బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు సరఫరా చేశారని తాజాగా హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దూమారం లేపాయి. జైలులో ఉన్న కొండారెడ్డి.. సీఎం వైఎస్ వల్లే సీబీఐ నుంచి తప్పించుకున్నాడని అన్నారు. అంతేగాక ఇటు జగన్ బాబాయి  వివేకానంద హత్య కేసు విషయంలోనూ దర్యాప్తు ముందుకు సాగకపోవడానికి జగనే కారణమని ఆయన పేర్కొన్నారు.

 

ఇదిలావుంటే.. కచ్చులూరు బోటు ప్రమాద విషయంలో ఒత్తిడి తెచ్చినందుకే జగన్ ప్రభుత్వం తనపై కక్ష గట్టిందని, అందులో భాగంగానే జైలుకు పంపారని తెలిపారు. కచ్చులూరు బోటు ప్రమాదంలో నిందితులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతి నుంచి రాజధానిని మార్చాలంటే.. సీఎం జగన్ ముందుగా ఎన్నికలకు వెళ్లి మళ్లీ గెలవాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే.. ఇది ఏ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో పెనుదూమరం రేపనుందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  అసలే వైఎస్ వివేకానందరెడ్డి కేసుపై సీబీఐకి అప్పగించాలని ఆయన కూతురు సునీత కోరుతోంది.

 

ఇందులో జగన్ పాత్రపైనా అక్కడక్కడ అనుమానపు ఊహాగానాలకు తేరలేపుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్.. ఇప్పడు అధికారంలో చేతిలో ఉన్న ఎందుకు మౌనంగా ఉంటున్నారనే దానిపై సందేహాలు లేకపోలేదు. ఎవరినీ రక్షించేందుకు మౌనం వహిస్తున్నారనే దానిపైనా పలు ఆరోపణలు జోరందుకున్నాయి. ఈ వ్యవహారం ఏపీ రాజకీయ వర్గాల్లో ఏటు పోయి.. ఎటు అంటుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. వివేకా కేసులో రోజురోజూకీ  ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదనేది వాస్తవం. మరి ఇవన్నీ ఎవరైనా కావాలనే చేస్తున్నారా? లేదా అన్నికేసుల మాదిరిగా ఇది నెమ్మదిగా ముందుకు కదులుతుందా అనే దానిపై రాజకీయ వర్గాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఏదిఏమైనా మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు సరికొత్త వివాదానికి తెరతీస్తాయా లేదా అన్నది వేచిచూడాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి: