చంద్రబాబు మూడు రాజధానులు బిల్లు కు అడ్డుకట్ట వేసేందుకు శాసన మండలి ని అడ్డంపెట్టుకుని మెలిక వేసిన నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన కొత్త వ్యూహాన్ని బరిలోకి దింపారు. నేరుగా అమరావతి రైతులను శాంతపరచి వారిలో తన పట్ల సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచుకొని మొదలు నుంచి నరుక్కుంటూ వచ్చాడు. కానీ జగన్ చేసిన పని చిన్న విషయం లా కనిపించినా దీని పట్ల ఆయన నా తన అనుభవాలు అన్నింటిని కలేసి ఎంతో హోం వర్క్ చేసి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది.

 

హిట్ పీరియడ్ లో అమరావతి రైతుల వద్దకు వెళ్లి పరిస్థితిని వివరిస్తే అక్కడ హింసాకాండ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయే తప్పించి మరే లాభం ఉండదు అని తెలుసుకున్న జగన్ నేరుగా మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాని తర్వాత అమరావతి రైతులకు అతను ఏం చేస్తాడో వివరించడం అతనికి పెద్ద సానుకూల అంశం అయింది. వారికి నెల నెలా ఇచ్చే డబ్బులు మరియు రైతు కూలీలకు ఏకంగా 2,500 రూపాయల నుండి మూడు వేల రూపాయలకు పెంచిన వేతనం ఇంకా ఎన్నో పింఛన్ లాంటి పథకాలను ప్రవేశ పెట్టిన జగన్ వారి అభిమానాన్ని చూరగొన్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

సరిగ్గా అసెంబ్లీలో అమరావతి రైతులను గురించి వారికి ద్రోహం చేయబోమని.. వీటన్నింటినీ వివరించిన జగన్ వెంటనే ఎమ్మెల్యే లావు శ్రీకృష్ణదేవరాయలు ని  ప్రాంతానికి పంపి వారితో చర్చలు జరిపి చేయడం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు అమరావతిలో పరిస్థితి మరీ అంతా ఘోరంగా ఏమీ లేదని అందరూ చెప్తుండడంతో కేవలం ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకుని ఇతర పార్టీలు రాజకీయం చేస్తున్నారని జగన్ ఎత్తుగడ వేయడం అతనికి మంచి ఫలితాన్ని ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: