2012 డిసెంబర్ 16వ తేదీన అర్ధరాత్రి 23 ఏళ్ల నిర్భయ అనే విద్యార్థునీపై  బస్సులో అత్యాచారం చేసిన విషయం తెలిసింది. అయితే ఈ ఘటనలో  బాధితురాలు నిర్భయ చనిపోయింది. నిర్భయ కేసులో ని నిందితులను శిక్షించేందుకు నిర్భయ అనే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకొచ్చింది. అయినప్పటికీ 2012లో ఈ ఘటన జరిగిన నేటికీ ఈ కేసులోని నిందితులకు శిక్ష పడలేదు. అయితే గత కొన్ని రోజుల క్రితం కోర్టు నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించినప్పటికీ... శిక్షణ సవాల్ చేస్తూ పై కోర్టులలో పిటిషన్ వేస్తూ ఉండడం... రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ ఉండడంతో ఈ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం నిందితులకు ఉరిశిక్ష పడాల్సి  ఉండగా  మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది. 

 

 

 అయితే ఈ కేసులో నిందితులకు ఉరిశిక్ష వాయిదా పడడం పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఆడపిల్లలపై అత్యాచారం చేసిన దోషులకు శిక్ష విధించేందుకు ఇంత ఆలస్యమైతే అత్యాచారాలు పెరగకుండా ఎలా ఉంటాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది దేశ ప్రజానీకం. కాగా నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష నిలుపుదల విచారణ సందర్భంగా న్యాయమూర్తి ధర్మేంద్ర రానా... శిక్ష నిలిపివేయడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో నిందితుడైన ముఖేష్ చట్టపరంగా ఉన్న అన్ని దారులూ మూసుకుపోయాయి అని అయితే... మిగతా నిందితులకు  మాత్రం అవకాశాలు ఉన్నాయంటూ తెలిపారు. భారతదేశంలోని న్యాయస్థానాలు దోషుల పట్ల ఎలాంటి వివక్ష కలిగి ఉండవు అని తెలిపిన న్యాయమూర్తి ధర్మేంద్ర రానా ... మరణ శిక్ష కూడా ఇందుకు మినహాయింపు అంటూ తెలిపారు. 

 

 

 మ్యానువల్  రూల్ 836 ప్రకారం ఒక కేసులో ఒకటి కంటే ఎక్కువ మంది దోషులు గా ఉన్నప్పుడు ముఖ్యంగా ఆ దోషులకు మరణ శిక్ష ఎదుర్కొంటున్నప్పుడు... ఒక దోషి లేదా కేసులోని అందరూ దోషులు  పిటిషన్ దాఖలు చేసినట్లయితే ఉరిశిక్షను వాయిదా వేయాల్సి ఉంటుంది అంటూ పేర్కొన్నారు. నిర్భయ కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష నుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నారు అన్న  విషయం వాస్తవమే అయినప్పటికీ చట్టపరంగా వారికి ఉన్నా అన్ని అవకాశాలను కల్పించడం నాగరిక సమాజంలో ఎంతో ముఖ్యం అన్నారు. నిర్భయ కేసులో నిందితులకు ఉరిశిక్షను వాయిదా వేసిన పటియాల హౌస్ కోర్టు... ఉరిశిక్ష ఎప్పుడు అమలు చేయాలనే దానిపై మాత్రం తీర్పును వెలువరించిన లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: