జనసేన పార్టీ పెట్టినప్పుడు, జనం సంద్రంలా నిండిపోయారు. ప్రతి వ్యక్తి సైన్యంలా వెంట వచ్చారు. ఆ వైభవం ఇప్పుడు లేక వెలవెలపోతున్న జనసేన నుండి వరుసగా వికెట్లు కూడా పడిపోతున్నాయి. అసలు లోలోపల జరుగుతున్న విషయాలు ఏంటో ఒక సృష్టతకు రాకుండా, పవన్ కళ్యాణ్ సిద్దాంతాలు నచ్చక వెళ్లిపోతున్నామని చెబుతున్న వారే కానీ అసలు విషయం ఇదని బాహాటంగా చెప్పడం లేదు. ఇక జన నాయకునిగా గళమెత్తిన పవన్ అసలు సినిమాలే చేయనని చెప్పారు. కానీ ఇప్పుడు తప్పని పరిస్దితుల్లో చిత్రపరిశ్రమ దగ్గరికి వెళ్లక తప్పడం లేదు అంటున్నారు.

 

 

మరి పవన్ సినిమాలపై దృష్టి పెడితే జన సైన్యాన్ని నడిపే నాయకుడు ఎవరుంటారు. ఇంతకాలం ఆ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి దిక్కు ఎవరు అవుతారు. ఇలాంటి పరిస్దితుల్లో ఎవరు ఎప్పుడు జనసేన పార్టీని విడిచి దూరంగా వెళ్లుతారో తెలియడం లేదు. ఇక తాజాగా నెలకొన్న పరిస్దితుల్లో సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మినారాయ‌ణ జ‌న‌సేన‌కు రాజీనామా చేయ‌డం ఆ పార్టీలో పెద్ద కుదుప‌నే చెప్పాలి. ఇప్పుడు ఆయన తర్వాత, ఎవ‌ర‌నే ప్ర‌శ్న స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

 

 

కాగా ల‌క్ష్మినారాయ‌ణ త‌ర్వాత ఆ స్థాయి నాయ‌కుడు తోట చంద్ర‌శేఖ‌ర్‌. ఈయ‌న కూడా ఐఏఎస్ అధికారి. అంతే కాకుండా ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త, ఇంతకాలం జ‌న‌సేన‌కు ఆర్థికంగా, హార్ఠికంగా తోడ్పాటునందిస్తూ వచ్చిన ముఖ్యుడు కూడా.. ఇకపోతే ఇంతగా సేవ చేసినా కూడా తనకు గుర్తింపు తగ్గించారని మనస్దాపం చెందారు. ఇదే కాకుండా ఎప్పుడైతే నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు పార్టీలో ప్రాధాన్యం పెరుగుతూ వచ్చిందో, తోట చంద్ర‌శేఖ‌ర్ నెమ్మ‌దిగా దూర‌మ‌వుతూ వ‌చ్చారు. అలా క్రమక్రమంగా పూర్తిగా పార్టీకి దూరమయ్యాడు.

 

 

ఈ నేప‌థ్యంలో తోట చంద్ర‌శేఖ‌ర్ అస‌లు జ‌న‌సేన‌లో ఉన్నాడా లేదా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్న క్రమంలో జ‌న‌సేన నుంచి త‌ప్పుకునే జాబితాలో ముందు వ‌రుస‌లో తోట చంద్ర‌శేఖ‌ర్ పేరు ఉంద‌ని స‌మాచారం...  ఇకపోతే జనమంతా కూడా వెళ్ళిపోయాక పవన్ మాత్రం ఖాళీ పార్టీని ఏం చేసుకుంటాడు విలీనం చేయడం తప్పా అని అనుకుంటున్నారట ఇప్పుడు ఏపీ ప్రజలు..

మరింత సమాచారం తెలుసుకోండి: