ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కేవలం అమరావతి మాత్రమే కరెక్టు.. ఇక ఏ నగరమూ ఏపీకి రాజధాని కాబోదు.. అయ్యే అర్హతలు ఒక్క అమరావతికి మాత్రమే ఉన్నాయి. అంతే కాదు..ఇదే సత్యం, ఇదే ధర్మం, ఇదే న్యాయం. అంతకు మించి ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు. ఒకవేళ ఎవరైనా అంటే వారు రాష్ట్ర ద్రోహులు, ప్రగతి నిరోధకులు. అంతే .. అంతే..

 

ఇదీ అమరావతి విషయంలో ఎల్లో పత్రికల ధోరణి, మీడియా ధోరణి. చివరకు పరిస్థితి ఎంత వరకూ వ‌చ్చిందంటే.. తాము రాసే రాతలు సరిపోవన్నట్టు.. దేశంలో ఎవరైనా ఎక్కడైనా సరే జగన్ కు వ్యతిరేకంగా కానీ.. మూడు రాజధానులకు వ్యతిరేకంగా కానీ ఏదైనా రాస్తే.. దాన్ని మళ్లీ ఈ పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించేస్తున్నారు. అబ్బే.. మేమే కాదు.. అమరావతే రాజదానిగా ఉండాలని.. జగన్ తీసుకున్న నిర్ణయం తప్పని.. వీళ్లు కూడా అంటున్నారు చూశారా అన్నట్టు ప్రత్యేక కథనాలు వండి వారుస్తున్నాయి.

 

అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఏపీలో మూడు రాజధానుల అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆ చర్చలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాటిలో తమకు కావాల్సినవి మాత్రమే ఏరుకుని.. ప్రత్యేకంగా కూర్చుకుని హైలెట్ చేయడం ఈ ఎల్లో మీడియా చేస్తున్న ఘన కార్యం. అదే వ్యాసకర్తలు, లేదా.. ప్యానలిస్టులు అమరావతిని తప్పుబడుతూ మాట్లాడిన మాటలు ఉంటే.. అవి వీరికి అస్సలు అవసరం లేదు. తమ స్టాండ్ కూ, తమ అధినేత స్టాండ్ కూ అనుకూలంగా ఉన్న వాటినే తీసుకుంటారు.

 

వాటినే ఆణిముత్యాలుగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. పాపం.. ఇంత కష్టపడుతున్నా.. ఇన్ని ప్రత్యేక కథనాలు వండుతున్నా.. జనంలో మాత్రం ఈ రాజధాని సెంటిమెంట్ పండటం లేదు. అమరావతే రాజధానిగా కొనసాగాలంటూ ఉద్యమాలు రావడం లేదు. ఒకటీ అరా ప్రదర్శనలూ, ఆందోళనలూ జరిగినా అందులో పచ్చ జెండాలు తప్ప వేరేమీ ఉండటం లేదు. హథవిధీ.. ఈ అమరావతిని ఎలా కాపాడేదీ..?

మరింత సమాచారం తెలుసుకోండి: