భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సు ను నిర్వహిస్తోన్న జిఎస్ఐటిఐ. హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (జిఎస్ఐటిఐ) భౌగోళిక శాస్త్రవేత్తల కోసం భౌగోళిక సమాచార వ్యవస్థపై 11 వ అంతర్జాతీయ కోర్సును నిర్వహిస్తోంది, దీనిని 2020 జనవరి 31 న హైదరాబాద్ లోని జిఎస్ఐటిఐలో ప్రారంభించారు. ఏటా ఈ కార్యక్రమాన్ని భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (ఐటిఇసి) కార్యక్రమం కింద నిర్వహిస్తున్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో సామాజిక మరియు ఆర్ధిక పురోగతిని ప్రోత్సహించడానికి , నైపుణ్యం కలిగిన నిపుణుల ఉత్పత్తికి సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.16 (పదహారు) ఐటిఇసి దేశాల నుంచి పద్దెనిమిది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూటాన్, బోట్స్వానా, కొమొరోస్, ఇథియోపియా, ఇరాన్, ఇరాక్, లైబీరియా, మడగాస్కర్, మాల్దీవులు, మారిషస్, మంగోలియా, నైజర్, నైజీరియా, రష్యా, దక్షిణ సూడాన్ లతో పాటుగా  టాంజానియా దేశాల ప్రతినిధులు 2020 జనవరి 31 నుండి 2020 ఫిబ్రవరి 29 వరకు జరిగే ఈ కోర్సుకు హాజరవుతున్నారు.

ఎం. శ్రీధర్, డైరెక్టర్ జనరల్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సమక్షంలో సిహెచ్. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మరియు హెడ్ మిషన్-వి, జిఎస్ఐటిఐ మరియు జిఎస్ఐటిఐ యొక్క ఇతర అధికారులు  ఈ కోర్సును ప్రారంభించారు. ఈ కోర్సులో భాగంగా, ఇందులో పాల్గొనేవారికి భౌగోళిక సమాచార వ్యవస్థ మరియు దాని అనువర్తనాల రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వబడుతుంది, తద్వారా ఈ పద్ధతులను వారి డొమైన్‌లో సమర్థవంతంగా వర్తింపజేయవచ్చు. ఈ విధంగా, భారతదేశం తన సామాజిక- ఆర్థిక అభివృద్ధి మరియు సాంకేతిక సాధన యొక్క ఫలాలను ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని భావిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: