జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడాన్ని తప్పు పడుతూ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేసిన నేపధ్యం లో , పవన్ నిర్ణయాన్ని అటు టీడీపీ నేతలు , ఇటు  లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ సమర్ధించారు . పవన్ మళ్ళీ  సినిమాల్లో నటిస్తే వచ్చిన తప్పేంటని జేపీ ప్రశ్నించారు . సక్రమ మార్గం లో ఆదాయాన్ని సంపాందించుకునేందుకు పవన్ సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోందని , దీనిపై ఎవరికీ ఆయన సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదంటూ , పరోక్షంగా జేడీ కి కౌంటర్ ఇచ్చారు .

 

ఇక పవన్ అటు సినిమాల్లో నటిస్తూనే , ఇటు రాజకీయాల్లో కొనసాగితే తప్పేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు . ఇక భవిష్యత్తు సినిమాల్లో నటించనని చెప్పి రాజకీయాల్లో అడుగిడిన పవర్ స్టార్ , తిరిగి సినిమాల్లో నటించాలని నిర్ణయించుకోవడాన్ని జేడీ తప్పుపడుతూ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెల్సిందే . జేడీ అభిప్రాయాలను గౌరవిస్తున్నట్లుగా పేర్కొంటూనే , పవన్ ఆయనకు ధీటైన సమాధానం చెప్పారు . తనకు సిమెంట్ కంపెనీలు , పవర్ ప్రాజెక్టులు , పాల ఫ్యాక్టరీ లేవంటూ , అలాగే పెద్ద మొత్తంలో వేతనం వచ్చే ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదని , అందుకే తనని నమ్ముకున్న వారికోసం , తన కుటుంబ కోసం సినిమాల్లో నటిస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు .

 

ఇక హిందీ లో సూపర్ , డూపర్ హిట్ అయిన పింక్ చిత్రం రీమేక్ లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర లో నటిస్తున్నాడు . ఈ సినిమా ను నిర్మాతలు దిల్ రాజు , బోనీ కపూర్ లు నిర్మిస్తుండగా , వేణు శ్రీరామ్ దర్శకతం వహిస్తున్నాడు . ఈ సినిమా అనంతరం దర్శకుడు క్రిష్ రూపొందించే ఒక రాజకీయ వ్యంగ్య చిత్రం లో పవన్ నటించేందుకు ఒకే చెప్పినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: