రెవెన్యూ సిబ్బంది తమపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో పునర్ ఆలోచించుకోవాలని ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న, వారం రోజుల వ్యవధిలోనే నిజామాబాద్ జిల్లా ఎడపల్లి తహశీల్ధార్ కార్యాలయ సిబ్బందిపై ఒక వ్యక్తి దాడి తెగబడడం చర్చనీయాంశంగా మారింది . నగర శివారు అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్ధార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి సురేష్ అనే వ్యక్తి సజీవదహనం చేసిన విషయం తెల్సిందే .  ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్,  పరోక్షంగా ప్రస్తావిస్తూ ...  రెవిన్యూ అధికారులు తమ పద్దతిని మార్చుకోవాలని , తమపై దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు .

 

 ముఖ్యమంత్రి చెప్పినట్టుగానే అవినీతికి అలవాటు పడిన రెవెన్యూ సిబ్బంది ఎడపల్లి మండల పరిధిలోని కుర్నాపల్లి లోని సర్వే నెంబర్లు 127, 128, 129 లోని తమ బంధువుల భూముల పట్టాదారు పాసు బుక్ లు ఇవ్వాలని రెవెన్యూ సిబ్బందిని శ్రీనివాస్ రావు అనే వ్యక్తి కోరగా , సిబ్బంది నిరాకరించడం తో కార్యాలయ ఫర్నీచర్ ధ్వంసం చేయడమే కాకుండా , అడ్డు వచ్చిన విఆర్వో పై దాడి చేశాడు . భూముల్ని తమ బంధువుల పేరిట పట్టా చేయాలని  కోరుతుంటే ,  గత ఏడాదిన్నరగా తమని తహశీల్ధార్ కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ రెవెన్యూ సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశాడు .

 

రెవెన్యూ సిబ్బంది అవినీతి , అక్రమాలు మించిపోయాయని , అందుకే నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రకటించిన విషయం తెల్సిందే . తమ భూములను పట్టా చేయమంటే ఏడాదిన్నరగా ఒక కుటుంబాన్ని రెవెన్యూ సిబ్బంది ఎందుకు కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారో ప్రతి ఒక్కరూ ఇట్టే అర్ధం చేసుకోగలరు . సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా రెవెన్యూ సిబ్బంది అవినీతిని కట్టడి చేయలేకపోవడానికి పనికిమాలిన పాత   చట్టాలే కారణమని తెలుస్తోంది .   

మరింత సమాచారం తెలుసుకోండి: