నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి పుట్టి ముంచేందుకు ఎపి సర్కారు సంచలమైన నిర్ణయాలు తీసుకున్నట్టు కన్పిస్తుందిగా. ఆయన ఆర్ధిక మూలాలకు చెక్ పెట్టె క్రమంలో ప్రణాళిక బద్దంగా జగన్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే దివాకర్ బస్సులను మూసేసారు. తాజాగా ఆయన గనులకు కూడా తాళాలు వేశారు. దీనితో జేసీ దివాకర్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమైపోయారు. విజయవాడలో శివాలమెత్తిపోయారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జెసి దివాకర్ రెడ్డి.

అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు పై జెసి దివాకర్ రెడ్డి తీవ్రంగా  స్పందించారు. ప్రభుత్వం పగ పగ పగ అంటూ రగిలిపోతుందని దుయ్యబట్టారు.  దీన్నే ఫ్యాక్షనిజం అంటారని జెసి దివాకర్ రెడ్డి తనదైన శైలిలో అభివర్ణించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం తో పోల్చుకుంటే తనకు జరిగిన అన్యాయం ఏ పాటిది అని ప్రశ్నిస్తున్న జెసి దివాకర్ రెడ్డి. లీజు రద్దు వ్యవహారంపై కోర్టులో తేల్చుకుంటానంటున్న జెసి దివాకర్ రెడ్డి సవాల్ చేశారు.

ఈ ప్రభుత్వం ఎవరి మీద పగ పెంచుకున్న ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. పగ తీర్చుకునే క్రమంలో వాడి ఆర్థిక మూలాలను సర్వనాశనం చేస్తుందన్నారు. అంతటితో తృప్తి చెందని ఆ ఫ్యాక్షనిజం.. వాడిని చంపేసి వాడి భార్య పిల్లలు అడుక్కు తింటుంటే అప్పుడు వారి ఇగో శాంతిస్తుందని మండిపడ్డారు. ఇదే ఫ్యాక్షనిజం అంటే అంటున్న  జెసి దివాకర్ రెడ్డి తీవ్ర స్వరంతో పేర్కొన్నారు. 


త్రిసూల్ ఫ్యాక్టరీ లీజుల రద్దు పై జేసీ ఘాటు వ్యాఖ్యలు..ఏపీ ఫ్రభుత్వం పగతో రగిలి పోతోంది..రాష్ట్రానికి జరిగిన నష్టంతో పోల్చితే ఇదెంత..బాధ ఏం లేదు , దీనిపై కోర్టులో తేల్చుకుంటా : ఎవరు చనిపోక పోతే వారిపై పగ పగ అన్నట్టు ప్రభుత్వం తీరు ఉంటోంది..దీన్నే ఫ్యాక్షనిజం అంటారు..చంపిన తర్వాత వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతిని, భార్యా పిల్లలు అడుక్కు తింటే చూసి ఇగో శాంతిస్తుంది, ఇదే ఫ్యాక్షనిజం. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.

కాగా గతంలో జేసీ బ్రదర్స్‌కు చెందిన బస్సులను ప్రభుత్వం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటర్ స్టేజ్ క్యారియర్ బస్సుల పర్మిట్లలో అవకతవకల కారణంగా అధికారులు దాదాపు 36 బస్సులను,అలాగే 18 కాంట్రాక్టు బస్సులను సీజ్ చేశారు. పర్మిట్లలో అవకతవకలకు తోడు నిబంధనలకు విరుద్దంగా బస్సులు నడుస్తున్నట్టు తమకు ఫిర్యాదులు అందాయని అప్పట్లో రవాణా శాఖ అధికారులు తెలిపారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం,టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచడం వంటి అంశాలపై తమకు ఫిర్యాదులు అందినట్టు చెప్పారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: