2020-21 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ సామాన్యుల సంక్షేమం కోసమని నిర్మల సీతారామన్ తన ప్రసంగం ప్రారంభించేటప్పుడు చెప్పారు. ప్రతి బాలిక,బాలుడు, ఎస్సీ,ఎస్టీ వెనుకబడిన వర్గాలు అందరూ జాతీయ నిర్మాణంలో కీలకమైన పాత్ర వహిస్తున్నారని ఆమె తెలిపారు. ఎస్టీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ముందడుగు వేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. శనివారం లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె ఆయా వర్గాల కేటాయింపులను డీటెయిల్ గా వివరించారు. ఎస్సీలు, ఓబీసీల సంక్షేమం కోసం రూ.85 వేల కోట్లు కేటాయిస్తున్నామని ఆమె ప్రకటించగానే సమావేశంలో ఉన్న రాజకీయ నేతలందరూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు.


అలాగే ఎస్టీల సంక్షేమం కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ. 53 వేల 700 కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదే విధంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.9500 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఎస్సి, ఓబిసి, ఎస్టీలతో పాటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ సంతోషాన్ని తన తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, భారతదేశం యొక్క గొప్ప గిరిజన సంస్కృతి, చరిత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి... ప్రభుత్వం రాంచీలో గిరిజన మ్యూజియం ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు.

మరోవైపు నెటిజన్లు మాత్రం జనరల్ కేటగిరీ వాళ్లకు కూడా బడ్జెట్ నుండి కొంత ఆదాయాన్ని కేటాయించాలని కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తగ్గిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కారణంగా సగటు కుటుంబం ఇప్పుడు వారి నెలవారీ ఖర్చులలో నాలుగు శాతం ఆదా చేస్తుంది. ఇవే కాకుండా, 60 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులను ఈ వ్యవస్థలో చేర్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: