రోజు దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. సంవత్సరం భారతదేశపు తలరాతని నిర్దేశించే జాతీయ బడ్జెట్ నేడు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. భారతదేశం లాంటి అత్యధిక జనాభా ఉన్న మరియు భిన్నమైన సంస్కృతిలు కలగలిసిన దేశం కి బడ్జెట్ తయారు చేయడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కానీ నిర్మల సీతారామన్ వరుసగా రెండోసారి విజయవంతంగా దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్ కు సంబంధించిన తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన సీతారామన్ కు మధ్యలో ఒక అవాంఛనీయమైన సంఘటన చోటు చేసుకుంది.

 

ఆమె తన ప్రసంగాన్ని మొదలుపెట్టిన రెండు గంటల 30 నిమిషాల తర్వాత ఆమె ఒక్కసారిగా తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శరీరంలోని షుగర్ లెవల్స్ అప్పటికే బాగా పడిపోవడంతో ఆమె మొత్తం చదవలేకపోయింది. ఇకపోతే ఆమె కళ్ళు తిరిగి పడిపోయేలా ఉంది అన్న సమయంలో పక్కనే ఉన్నా మరొక కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు షుగర్ లెవెల్స్ పడిపోకుండా ఒక చాక్లెట్ ను ఇచ్చారు. ఆయనతోపాటు ఒక మహిళా ఎంపీ కూడా నిర్మల సీతారామన్ కు చాక్లెట్ ఆఫర్ చేశారు.. తరువాత కొద్దిగా నిలదొక్కుకున్నట్లు కనిపించినా.. ఆమె మళ్ళీ కొద్దిసేపటికే ప్రసంగించలేకపోవడం గమనార్హం.

 

ఇకపోతే బడ్జెట్ మరో రెండు పేజీలు ఉందనగా ఆమె తన ప్రసంగాన్ని ఆపేసి సభకు బడ్జెట్ ను అందజేస్తున్నట్లు చెప్పింది. అనర్గళంగా దాదాపు 150 నిమిషాల పాటు ప్రసంగించిన ఆమె అప్పటికే రికార్డు టైం చదివేసింది. తర్వాత కొంచెం అలసినట్లు కనిపించిన ఆమె ఎటువంటి రిస్క్ తీసుకోకుండా సభకు బడ్జెట్ ను ఇచ్చేసిన ఆమె యొక్క వాగ్ధాటికి సభ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.

మరింత సమాచారం తెలుసుకోండి: