బడ్జెట్ 2020 ని ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు.  నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ అనేకమందిని మెప్పించింది.  రైతులకు సంబంధించి అనేక అంశాలను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు.  2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్టుగా నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  దీంతో పాటుగా రసాయన ఎరువులకంటే కూడా సేంద్రియ ఎరువుల వినియోగం పెంచేందుకు ఈ బడ్జెట్ లోపేర్కొన్నారు.  అంతేకాకుండా, మహిళలు, శిశువులకు సంబంధించిన పౌష్టికాహారం కోసం భారీ బడ్జెట్ ను కేటాయించారు.  


అంతేకాదు, ఈ బడ్జెట్ లో అంగన్వాడీ వారికోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించినట్టు తెలుస్తోంది.  అంతేకాదు, ఇప్పటికే అంగన్వాడీ కార్యకర్తలకు దాదాపుగా ఆరు లక్షల స్మార్ట్ ఫోన్లు ఇచ్చినట్టు కేంద్రం పేర్కొన్నది.  స్మార్ట్ ఫోన్లను విరివిగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు.  దేశంలో 10 కోట్ల కుటుంబాలకు పౌష్టికాహారం అందుతున్న తీరును ఎప్పటికప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ల ద్వారా అప్డేట్ చేస్తున్నారని, ఈ పధకం అద్భుతంగా అమలు జరుగుతుందని అంటున్నారు.  

 

స్కూల్స్ లో పిల్లల కోసం అంగన్వాడీ కార్యకర్తలు పౌష్టికాహారం సప్లై చేస్తుంటారు.  పిల్లల సంరక్షణ అంశం కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలే చూసుకుంటారు. వీరికి సంబంధించిన నిధులను కేంద్రం కేటాయిస్తోంది.  ఈ నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం ఇస్తుంటారు.  అంగన్వాడీ కార్యకర్తలు స్మార్ట్ ఫోన్ల ద్వారా తీసుకునే సమాచారాన్ని ఎలా కేంద్రానికి చేరవేస్తారనే విషయాన్ని మాత్రం బయటకు చెప్పకపోవడం విశేషం.  


ఇకపోతే, ఈ బడ్జెట్ చాలా వరకు క్లుప్తంగా ఉన్నప్పటికీ విడమరిచి లేకపోవడం అందరికి కన్ఫ్యూషన్ లో పడేసింది.  ఏ రాష్ట్రానికి ఎలాంటి నిధులు కేటాయించారో చెప్పలేదు. 5 స్మార్ట్ సిటీస్ ను ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు.  అవేంటి అన్నది బడ్జెట్ లో పేర్కొనలేదు.  అంతేకాదు, ఈ బడ్జెట్ లో కేవలం బెంగళూరుకు మాత్రమే ఎక్కువ నిధులు కేటాయించారు.  మెట్రో తరహా సబర్బన్ ను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: