స్వర్గం అనే పేరు వినగానే మనకు ఊహల్లో ఎన్నెన్నో ఆలోచనలు కదలాడుతుంటాయి. అలాగే  ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కలగా ఉంటుంది. అయితే.. దాన్ని మనం చాలా సుందరంగా తీర్చిదిద్దాలని అనుకుంటాము. ఇంకా ఇంట్లో ఎన్నెన్నో ఖరీదైన వస్తువులను అమర్చాలనుకుంటాము. అలాగే ఈ బ్రిటీష్‌ బిలినియర్‌ జాన్‌ కాడ్వెల్‌ (69)కు కూడా తన ఇంటిని స్వర్గాన్ని తలపించేలా తన కలల సౌధాన్ని లండన్‌ లో నిర్మించుకున్నాడు. 


43,000 చదరపు అడుగుల్లో  నిర్మించుకున్న ఇంట్లో దేనికి కొరత లేదు. స్విమ్మింగ్‌ ఫూల్‌ ను తలపించే డైనింగ్‌ టెబుల్‌, నదిని తలపించేలా భోజనాల గదితో అద్భుతంగా తీర్చి దిద్దాడు. ఇప్పుడు ఇది లండన్‌ లోనే అత్యంత ఖరీదైనా భవనంగా మారింది. 


ఈ ఇల్లును తొమ్మిది అంతస్తులతో నిర్మించారు. ఈ ఇంట్లో 15 పడక గదులు, బాల్‌ రూమ్‌, క్యాటరింగ్‌, హిడెన్‌ లిఫ్ట్‌, స్టాక్‌ పార్కింగ్‌ తో పాటుగా 200 మందికి ఒకేసారి అతిథ్యం ఇవ్వొచ్చు. అలాగే.. వినోదం కోసం స్విమ్మింగ్‌ ఫూల్‌, జిమ్‌, సెలూన్‌, మీడియా రూం, గేమ్‌ రూమ్ లు ఉన్నాయి. థాయ్‌ లాండ్‌ ను తలపించేలా రంగు రంగుల చేపలతో ప్రవహిస్తున్న నదిలా ఉండే భోజనాల గదిలో నిరంతరం నీరు ప్రవహించడానికి వాటర్‌ రీసైకిల్‌ సిస్టమ్‌ ను ఏర్పాటు చేశారు.  దీంతో అది అచ్చం నదిలో ఉండి భోజనం చేస్తున్న అనుభూతిస్తుంది. 


కాగా  ఈ ఇంటిని 81 మిలియన్‌ పౌండ్లకు దీన్ని జాన్‌ కాడ్వెల్‌ కొన్నట్లు సమాచారం. 250 మిలియన్ల పౌండ్లతో ఈ ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం. అంటే అక్షరాల రూ. 2347.9 కోట్లు. లండన్ మైఫేర్ ప్రాంతంలోని 18, 19 శతాబ్థం నాటి రెండు కట్టడాలను విలీనం చేసి ఈ ఇంటిని నిర్మిస్తున్నారని సమాచారం. అయితే ఈ ఇంటిని సుల్తాన్‌ బ్రూనై సోదరుడు ప్రిన్స్‌ జెఫ్రీ బొల్కియా నుంచి దీన్ని జాన్‌ కాడ్వెల్‌ కొంటున్నాడట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: