తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయే రోజులు దగ్గర పడ్డాయి అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ గత సంవత్సరం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్ఎస్ కు షాక్ ఇచ్చింది. ఇక టిఆర్ఎస్ రోజులు లెక్కపెట్టుకోవాల్సిందే అని అంతా అనుకుంటున్న నేపథ్యంలో కొన్ని కాంట్రవర్షియల్ నిర్ణయాలు తీసుకొని బిజెపి అటు కేంద్రంతో పాటు ఇటు తెలంగాణలో కూడా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంది. దాని ఫలితం మనకి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్పష్టంగా కనబడింది.

 

అయితే ఇప్పుడు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాల కి విపరీతమైన అన్యాయం జరిగిందన్న విషయం అక్షరాలా సత్యం. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ బడ్జెట్ వల్ల తమ రాష్ట్రానికి ఒరిగేది ఏంది అంటూ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. కేవలం ఉత్తరానికి మాత్రమే ఉపయోగపడేలా నిధులు మంజూరు చేయడం మరియు దక్షిణ రాష్ట్రాలలో…. మరీ ముఖ్యంగా తెలంగాణకు మొండిచేయి చూపించడం పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వెళ్లగక్కినట్లు సమాచారం.

 

ఇకపోతే మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత తను ఫెడరల్ ఫ్రంట్ పనులను పునరుద్ధిస్తాను అని కేసీఆర్ చెప్పడం తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్రమైన దెబ్బ కొట్టింది. అసలే మోదీ పరిస్థితి ఇప్పుడు కేంద్రంలో అంతంత మాత్రంగా ఉంది. ఏపీలో లో మాత్రం ప్రభావం చూపించకుండా ఉన్న పవన్ తో జత కట్టిన విధానం చూస్తే అతను ఆసరా కోసం ఎంత తాపత్రయపడుతున్నాడో తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రానికి ఇటువంటి దెబ్బ కొడితే కెసిఆర్ తన రాష్ట్రాన్ని చక్కదిద్దుకునే పనిలో బిజీగా ఉంటారు కానీ మోదీకి ఎదురెళ్ళే అవకాశం ఉండుదు కాబట్టే బడ్జెట్ తెలంగాణ రాష్ట్రానికి కు ఎటువంటి స్కోప్ లేకుండా ఉంది అని కేటీఆర్ అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: