రాష్ట్రాలకు న్యాయంగా రావాల్సిన నిధుల్లో కేంద్రం భారీగా కోతలు విధించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇది రాష్ట్రాల పురోగతికి శరాఘాతంగా మారనుందన్నారు. ‘‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు చెల్లించే వాటాను 42 శాతం నుంచి 41 శాతం తగ్గించడం వల్ల అన్ని రాష్ట్రాలకు నష్టం కలుగుతుందని అన్నారు . జిఎస్టీ చట్టం అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్దిని ప్రదర్శించడం లేదని విమర్శించారు . 14 శాతం ఆదాయ వృద్ధిరేటు లేని రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం అందిస్తామనే చట్టం హామీని కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కిందని మండిపడ్డారు .
 
చాలా నెలలుగా దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనాన్ని అధిగమించేందుకు కేంద్రం ఎలాంటి ప్రగతిశీల నిర్ణయాలు ప్రకటించలేదని చెప్పారు .దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే నిర్ణయాలేవీ కేంద్రం తీసుకోలేదని అన్నారు . అతి ముఖ్యమైన రంగాలకు బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడం పూర్తి ప్రగతి నిరోధక చర్య అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు . వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, తదితర రంగాలకు నిధులను తగ్గించారని ఆయన తెలిపారు . ఇది దేశ పురోభివృద్ధిపై, సామాజికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కేసీఆర్ అన్నారు. వ్యవసాయరంగానికి 2019-20 సంవత్సరంలో 3.65 శాతం మేర నిధులు కేటాయించగా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 3.39 శాతం మాత్రమే నిధులు కేటాయించారని కేసీఆర్ తెలిపారు .
 
వైద్య ఆరోగ్య రంగానికి గత ఏడాది 2.24 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 2.13 శాతం నిధులు మాత్రమే కేటాయించారని అన్నారు . గ్రామీణాభివృద్ధికి గత ఏడాది 4.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.94 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు .  విద్యా రంగానికి గత ఏడాది 3.37 శాతం నిధులు కేటాయించగా, ఈ ఏడాది 3.22 శాతం నిధులు మాత్రమే కేటాయించారని చెప్పారు .

మరింత సమాచారం తెలుసుకోండి: