పెళ్ళికి ఆడపిల్లల వయసు 18  తప్పనిసరిగా ఉండాలి.  18 నిండితేనే పెళ్లి చేయడానికి చట్టపరంగా రూల్స్ ఉంటాయి.  ఒకవేళ అంతకంటే తక్కువ వయసులో పెళ్ళిళ్ళు చేస్తే దాని వలన ఇబ్బందులు పడటమే కాకుండా, ఆడపిల్లలు కూడా శారీరకంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.  అందుకే పెళ్లి విషయంలో ఖచ్చితంగా 18 నిండాల్సిందే అన్నది ఇప్పటి వరకు రూల్.  18 సంవత్సరాల వయసు ఉంటె దాని వలన అమ్మాయికి అన్ని విషయాల్లో సరైన అవగాహన వస్తుంది.

 
అవగాహనతో పాటుగా అన్ని విధాలుగా కూడా ఇబ్బందుల నుంచి తప్పుకున్నట్టు అవుతుంది.  పైగా శరీరంలోని అన్ని అవయవాలు కూడా ఎదుగుతాయి. అయితే, కొంతమంది వ్యక్తులు బాల్యవివాహాలను ప్రోత్సహిస్తూ ప్రజలు ఇబ్బందులు పడేలా చేస్తున్నారు.  దీని వలన సమాజం కూడా ఇబ్బందులు పడుతున్నది.  అందుకే దీని నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కొన్ని విధానాలను తీసుకొచ్చింది.  అదేమంటే, ఏ వయసులో పెళ్లి చేసుకుంటే మంచిది అనే విషయం తెలుసుకోవడం కోసం ఓ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు.  


ఈ విషయాన్నీ  నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్ సెషన్ లో పేర్కొన్నారు.  శనివారం బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయంపై ప్రకటన చేశారు. అమ్మాయిల పెళ్లి వయసుపై ఈ టాస్క్‌ఫోర్స్ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుందని చెప్పారు. బాల్య వివాహాలను నివారించేందుకు, ఆడ పిల్లల హక్కులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే స్త్రీ, శిశు సంక్షేమం పైనా ఈ టాస్క్ ఫోర్స్ అధ్యయనం చేస్తుందని ఆమె తెలిపారు.  


ఈ బడ్జెట్ సెషన్ లో చెప్పినట్టుగా అన్ని రకాలుగా స్త్రీలను, మహిళలను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తున్నది.  మహిళలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అందరికి ఆమోదయోగ్యంగా ఉండబోతున్నట్టు చెప్తున్నారు.  స్త్రీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, స్త్రీలు ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలని, ఉంటారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: