ఆర్థిక మంత్రి నిర్మల సీతారాం సమర్పించిన కేంద్ర బడ్జెట్ 2020 లో కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మహారాష్ట్రను విస్మరించిందని మహారాష్ట్ర  కేబినెట్ మంత్రులు శనివారం పేర్కొన్నారు.   బడ్జెట్‌ను  ఉతుత్తి తతంగం  అని పేర్కొన్న అశోక్ చవాన్, ముంబై, మహారాష్ట్రలను ఆర్థిక మంత్రి, మరియు కేంద్ర  ప్రభుత్వం  పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. బడ్జెట్‌లో మహారాష్ట్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించారా అని కూడా మంత్రి ప్రశ్నించారు.

 

 

 

 

 

ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్‌ లోని మంత్రి  బుల్లెట్ రైలు ఆవశ్యకతను ప్రశ్నించారు.  బుల్లెట్ రైలు కి  ఇప్పుడు అంతా  ప్రాధాన్యత అవసరం లేదు. ప్రస్తుతం మాకు బుల్లెట్ రైలు వద్దు. మేము ప్రస్తుతం ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయాలి. కోచ్‌లు శుభ్రంగా ఉండాలి. బుల్లెట్ రైలు గుజరాత్ మరియు అహ్మదాబాద్‌కు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది, నేను గుజరాత్ మరియు అహ్మదాబాద్‌కు వ్యతిరేకం  కాదు, రైల్వేలో సరైన సౌకర్యాలకు ప్రాధాన్యత ఇవ్వాలి  అని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

 

అశోక్ చవాన్ మాట్లాడుతూ, ప్రస్తుత వృద్ధి రేటు కేవలం 4.5 మాత్రమే వుంది అని,  మన దేశంలో అత్యధిక నిరుద్యోగం ఉంది అని,  ఈ సమస్యను  ఎలా అధిగమిస్తారో అని ? ఇరవై రెండు లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి, దానిపై కూడా ఏమీ చెప్పలేదు అని అయన  అన్నారు. ఈ బడ్జెట్ లో   మహారాష్ట్ర కోసం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి  నిధులు   కేటాయించలేదు అని చవాన్ అన్నారు . అంతర్జాతీయ ఫైనాన్స్ సెంటర్‌ను ముంబై నుండి  గుజరాత్‌కు తీసుకు వెళుతున్నారు. నేను దీనిని  తీవ్రంగా ఖండిస్తున్నాను. మహారాష్ట్రకు ఇది  చాలా చెడు చేస్తోందని  అని చవాన్ అన్నారు. ఈ  బడ్జెట్ బ్యాంకుల పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మరియు  రైతులకు ఎటువంటి  ఉపశమనం ఇవ్వలేదని  చవాన్ అన్నారు. ఎన్‌సిపి నాయకుడు, క్యాబినెట్ మంత్రి జయంత్ పాటిల్ మాట్లాడుతూ, మహారాష్ట్ర గురించి మరచిపోండి, దేశం మొత్తం బడ్జెట్ నుండి ఏమీ పొందలేదు అని అయన అన్నారు. మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బాలాసాహెబ్ తోరత్ ఈ బడ్జెట్‌ను దిక్కులేని మరియు అర్థరహిత   బడ్జెట్ గా  పేర్కొన్నారు.  భారతదేశాన్ని కొత్త ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇవ్వాలని మోడీ ప్రభుత్వం యోచిస్తుందా?  అని తోరత్ అన్నారు. ఇవి సమస్యాత్మక ఆర్థిక వ్యవస్థకు సంకేతాలు, దీనిని  ప్రభుత్వం ఎప్పుడు అంగీకరిస్తుందో, అని  తోరత్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: