నాటి రోజుల్లో మనుషులు మనుషుల్లా బ్రతికే వారు. నేటిరోజుల్లో మనుషులు మృగాళ్లుగా బ్రతకడానికి అలవాటుపడ్దారు.. దీనివల్ల తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడు. ప్రపంచవినాశనానికి కారణం అవుతున్నాడు. ఇక సమాచార సాంకేతిక రంగంలో వచ్చిన అభివృద్ధి వల్ల ఈనాడు ప్రపంచం కుగ్రామంగా మారింది. ఇక్కడ మనుషులు ఉంటారు. అన్ని ఉంటాయి. కానీ ఎవరికి ఎవరు ఏమి కారు. పూర్తిగా స్వార్ధం తెల్లబట్టలు తొడుక్కుని అందరితో కలిసిపోతుంది.

 

 

ఇక ప్రపంచం ఒక సృష్టి అయితే, దైవ విధానంలో ఒక భాగంగా మానవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. సమాజం కూడా దైవ పథకంలో భాగమే కనక మానవుడు చెప్పగలిగింది అతి స్వల్పం మాత్రమే. మానవుడు ఉనికిలోకి రాగానే సహకార జీవితావసరాన్ని గ్రహించాడు. ప్రకృతి శక్తుల నెదుర్కోవడానికి, అనేక వైపరీత్యాల నుంచి కాపాడుకోవటానికి ఆదిమ దశలో మానవుడు సహకారావశ్యకతను గమనించాడు. ఇకపోతే మానవుని పరిణామ క్రమంలో మనుగడకు మొదటి ఆలోచన ఆకలి. ఆ ఆకలిని తీర్చుకోడానికి తనలో ఉండే ప్రతికూల వ్యక్తిత్వాన్ని ఉపయోగించి వేటాడటం మొదలు పెట్టడం జరిగింది.

 

 

కాలక్రమేనా మానవుని ఆలోచన విధానంలో ఎన్నో మార్పులు రావడం వలన ప్రతికూల వ్యక్తిత్వం కొద్దిగా కనుమరుగు అవడం జరిగింది. కాని ఇప్పటికి మనలో ప్రతికూల వ్యక్తిత్వం అనేది అంతరించి పోలేదు. దాన్నే మనం వాడుక భాషలో చేడుతనం అని చెప్తూ ఉంటాం. అది ఈ కాలంలో ప్రజల్లో చాలా ఇమిడి పోయింది. ఎలాగంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తన వ్యక్తిత్వం ద్వారా బాధ పెట్టడం, హింసించడం, స్వార్థం, ఈర్ష, ద్వేషం, ఇవి పూర్తిగా ప్రపంచాన్ని మార్చేసాయి..

 

 

ప్రపంచంలో ఏ వ్యక్తి పరిపూర్ణ మైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండరు అని అందరికి తెలిసిన సత్యం. మనలో ఉండే ప్రతికూల వ్యక్తిత్వాన్ని ఎటువంటి సమయాల్లో ఉపయోగించుకోవాలో ఆ సమయం వచ్చినప్పుడు వాడుకుంటే విలువ దక్కుతుంది. ఇకపోతే నేటి కాలంలో మనిషి చేసిన తప్పిదాల వల్ల ప్రకృతి గతి తప్పి పలు విధ్వంసకాలకు కారణం అవుతుంది. కొత్త కొత్త రోగాలకు లోకం నిలయంగా మారి జనులు అల్లాడిపోతున్నారు. ఇలా ప్రపంచం వినాశనం అంచుకు చేరుందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంది..

మరింత సమాచారం తెలుసుకోండి: