పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఆత్మహత్యలు రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. ప్రజలకి రక్షణ కల్పించాల్సిన పోలీసులే జీవితం మీద భయంతో ఆత్మహత్య చేసుకోవడం మంచి పరిణామం కాదు. కానిస్టేబుళ్ళు, ఎస్సైల ఆత్మహత్యలు డిపార్ట్ మెంట్ మీద చెడు అభిప్రాయాన్ని కలిగించే విధంగా ఉంటున్నాయి. గత ఏడాది డిసెంబరు నెలలో వేటపాలెంలో మాధవరావు అనే హెడ్ కానిస్టేబిల్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

 

 

అయితే విచారణలో ఈ కేసులో మరో కొత్త కోణం బయటపడింది. మాధవరావు డిసెంబరు ౨౦ వ తేదీన ఆత్మహత్యకి పాల్పడ్డాడు. అయితే అనారోగ్య సమస్యల వల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి గల కారణం తెలిసింది.నిజానిజాల్లోకి వెళితే మాధవరావు కొన్ని రోజుల క్రితం తనకి తెలిసిన వ్యక్తికి ఒక మహిళ దగ్గర ప్పు ఇప్పించాడు. అయితే ఆ అప్పు తీసుకున్న వ్యక్తి ఎంతకీ అప్పు కట్టకపోవడంతో ఆ మహిళ మాధవరావుని అడిగింది.

 

 

 

దానికి మాధవరావు అతను డబ్బు ఇవ్వట్లేదని తెలియజేయడంతో మహిళ వినిపించుకోకుండా.. డబ్బు మీరే కట్టాలని ఒత్తిడి తెచ్చింది. డబ్బులు తీసుకున్న వ్యక్తి తనను మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్నాడని మాధవరావు చెప్పినా ఆ మహిళ వినిపించుకోలేదు. దీనితో అన్ని డబ్బులు కట్టలేక మాధవరావు ఏం చేయాలో ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. మాధవరావు కాల్‌డేటాను పరిశీలించిన పోలీసులు ఈ కొత్తకోణాన్ని కనుగొన్నారు.

 

 

 

 

మాధవరావు కాల్ డేటాని పరిశీలించిన పిమ్మట పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చారు. అనారోగ్యంతో బాధపడి ఆత్మహత్య చేసుకున్నాడని భావించిన వారందర్ ఈ నిజం తెలుసుకుని షాక్ కి గురవుతున్నారు. అయితే ప్రస్తుతం ఆ మహిళని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ విచారణలో మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది

మరింత సమాచారం తెలుసుకోండి: