ఇప్పటివరకూ చైనా అంటే అమెరికాకు, భారత్ కు పోటీ దేశమని, ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశమనీ, డూప్లికేట్ వస్తువులు ఎక్కువగా తయారయ్యే దేశమనీ ప్రపంచానికి తెలుసు. ఇవన్నీ ఆ దేశానికి  గుర్తింపును తెస్తే ఇప్పుడు 'కరోనా' వైరస్ ఆ దేశానికి మచ్చ తెస్తోంది. రోజుల తేడాలో ఆ ప్రాణాంతక వైరస్ ప్రపంచాన్ని చుట్టేస్తోంది. మందు లేని వైరస్ గా ప్రపంచాన్ని వణికించేస్తోంది. చైనాలో వేలల్లో వ్యాధిగ్రస్తులూ.. వందల్లో మరణాలు సంభవించడానికి కారణమైన కరోనాకు విరుగుడు ఎలా అని ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో చైనా ఓ శుభవార్త చెప్పింది.

 

 

చైనా నుంచి మెల్లమెల్లగా  ప్రపంచంలోని అన్ని దేశాలకు మెల్లమెల్లగా విస్తరిస్తోన్న ఈ ప్రాణాంతక వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదని.. వ్యాధి తీవ్రత తగ్గుతోందన్న చైనా ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇప్పటికే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడినవాళ్లలో దాదాపు 300 మంది వరకూ చనిపోయారు. కరోనాకు విరుగుడు ఎలా అని ప్రపంచమంతా ఆలోచిస్తున్న ఈ సమయంలో చైనా చేసిన సంచలన ప్రకటన ఊరటనిస్తోంది. ప్రస్తుతానికి కరోనా వైరస్ నుంచి బాధితులు కోలుకుంటున్నారని.. 243 మందిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశామని చైనా అధికారులు అంటున్నారు. వ్యాధి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వారు ప్రకటించడంతో ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

ఇప్పటివరకూ చైనాలో 11వేల మందికి పైగా కరోనా వైరస్ బాధితులను గుర్తించారు. నేషనల్ హెల్త్ కమిషన్ ఆధ్వర్యంలో సత్వర నివారణ చర్యలు తీసుకోవడంతో బాధితులకు పెద్ద ఎత్తున వైద్య సాయం అందుతోంది. అయితే.. ఈ వైరస్ పై హైఅలర్ట్ కొనసాగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: