ఈ ప్రపంచం...ఓ  మహా సముద్రం లాంటిది. ఎంతో విశాలమైనది.. ఆది  అంతాలను తనలోనే కలుపుకున్న అత్యంత అద్బుతమైనది... ఇలా ఎంత చెప్పినా చెప్పాల్సింది బోలెడంత వుంటుంది..ఎన్ని పేజీలు  రాసినా రాయాల్సింది మిగిలే వుంటుంది. పరిశోధనలెన్ని చేసినా... గుట్టు తెలియని రహాస్యాల పుట్ట ఉండనే ఉంటుంది. కాలం వేగంగా పరిగెడుతుంది. కాలంతో పాటే మనిషి కూడ పోటిపడుతున్నాడు.

 

 

లేచింది మొదలు  నిద్రించే వరకు పరుగులే పరుగులు. ఇలాంటి జీవితంలో నమ్మకం అనేది మనిషికి అత్యంత ముఖ్యమైనది. ఈ నమ్మకం అనేది మనిషి ఆలోచనలను బట్టి ఉంటుంది.. ఆ ఆలోచనల నుండి వచ్చే  నమ్మకానికి మూఢనమ్మకానికి వ్యత్యాసం చాలా ఉంది. లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మడం భ్రమ. ఉన్నదాన్ని లేదనుకోవడం అవివేకం.. ఇకపోతే నాటి నుండి నేటివరకు ప్రతివారిని వేధిస్తున్న ప్రశ్న దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? ఈ సృష్టిలో మంచి దేవుడనుకుంటే, చెడు దెయ్యం అని అనుకునే వారు ఉన్నారు. దెయ్యాలు ఏంట్రా మనం ఉన్నది కంప్యూటర్ యుగంలో అవన్ని పిచ్చినమ్మకాలు అని కొట్టిపారేసే వారు ఉన్నారు..

 

 

అయితే ఈ నమ్మకం అనేది ఒక మనిషిలో ఉన్న అంతర్గత శక్తులను పూర్తిగా కమాండింగ్ చేస్తుంది.. ఒకరకంగా నమ్మకం మానసికంగా బలాన్ని కలిగిస్తుంది.. అపనమ్మకం మానసిక బలహీనునిగా మార్చుతుంది. ఇకపోతే ఇప్పటికీ ఈ ప్రపంచంలో ఎందరో దెయ్యాలు ఉన్నాయని విశ్వసిస్తారు. ఆందుకు అనుగుణంగా అక్కడక్కడ జరిగే సంఘటనలకు ఎక్కువగా ప్రచారాన్ని కల్పిస్తారు. అయితే ఇప్పుడు చూడబోయే సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు గాని ఇలా జరిగిందట అని మాత్రమే చెబుతున్నాము. కాని నమ్మమని చెప్పడం లేదు.

 

 

ఇక ప్రచారం జరుగుతున్న వార్త ప్రకారం. హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో గల ఓ ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ సెల్లార్‌లో దెయ్యం తిరుగుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రెండు వీడియోలు హల్‌చల్ చేస్తున్నాయి. ఒక వీడియోలో నిచ్చెన దానంతట అదే నడుస్తోంది. మరో వీడియోలో ఓ యువతి సెల్లార్‌లో జుట్టు విరబూసుకుని కుర్చుని ఏడుస్తోంది. మరి ఈ ఘటనలు నిజంగానే గచ్చిబౌలీలోనే చోటుచేసుకున్నాయా? లేదా ఎవరైనా కావాలని దీన్ని ప్రచారం చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి దీన్ని ఒక వైరల్ న్యూస్‌గానే చూద్దాం తప్పితే ఎలాంటి భావనకు లోను కావద్దని విన్నపం..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: