ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. అధికారం చేపట్టిన రోజు నుంచే జగన్ దూకుడుగా వ్యవహరిస్తూ.. పాలనలో తన మార్కు చూపిస్తూ దూసుకుపోతున్నారు. అనూహ్యంగా రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాధన చేసి దేశంలోనే సంచలం సృష్టించాడు. ప్రకటించడమే తడువుగా వెంటనే కార్యచరణ చేపట్టి అందుకు అనుగుణంగా మంత్రి వర్గంలో ఆమోదం, అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తూ దూకూడుగా వ్యవహరిస్తున్నారు.

 


ఈ చర్యలు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు మింగుడు పడడంలేదు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు మొదటి సీఎంగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు.. తన మార్క్ కనిపించేలా సింగపూర్ సిటీని తలపించేలా రాజధానిని నిర్మిస్తానని అమరావతిలో రాజధానిగా ప్రకటించారు. ఈ మేరకు అక్కడే తాత్కాలిక హైకోర్టు, అసెంబ్లీని నిర్మించి పాలన ప్రారంభించారు. అమితే వైసీపీ అధికారం చేపట్టాక అమరావతిలో రాజధానిని కొనసాగించకుండా జగన్ మూడు రాజధానులను ప్రకటించారు.

 

అయితే జగన్ ప్రతిపాధనకు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మద్దతు ప్రకటించారు. కేవలం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలోని కొంతమంది మాత్రమే మూడు రాజధానులకు వ్యతిరేఖంగా ఉద్యమాలు చేస్తున్నారు. టీడీపీ సైతం ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాలు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గ్రామస్థాయిలో ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు పూనుకున్నారు. స్వయంగా ప్రజల వద్దకే వెళ్తూ.. అమరావతే ఎందుకు రాజధానిగా ఉండాలో వివరిస్తున్నారు. తాను అమరావతి కోసం కన్న కలలను, పెట్టిన ఖర్చు, విదేశీ పెట్టుబడులు ఇలా సవవిరంగా వివరిస్తూ ప్రజల్లోకి మూడు రాజధానులకు వ్యతిరేఖంగా ఉద్యమిస్తున్నారు. 

 

చంద్రబాబు ప్లాన్ ను పసిగట్టిన జగన్.. మూడు రాజధానులు వస్తే మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైసీపీ ప్రచారం చేపట్టారు.  మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు గ్రామస్థాయి నాయకుల వరకూ   స్తున్నది. దీనిని ప్రజల మెదళ్లలోకి బాగా ఎక్కించింది. ఆంధ్రప్రాంతంలో వ్యతిరేకతలు ఉన్నా, ఉత్తరాంధ్రా, రాయలసీమలో మాత్రం మూడు రాజధానులకు జై కొడుతున్నారు. దీనిని ఆసరాగా తీసుకొని, ఇప్పుడు బాబు సొంత గ్రామంలో ఆయనకు చెక్ పెట్టాలని చూస్తోంది.

 

నారావారిపల్లిలో ప్రజాసదస్సు పేరిట భారీ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రజల నుంచి మూడు రాజధానులు మద్దతు కోరబోతున్నది. ఒకవేళ నారావారిపల్లి ప్రజలు మూడు రాజధానులు అనుకూలంగా ఉన్నారు అంటే బాబు పనైపోయినట్టే. ఇప్పటికే చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులకు సైతం పరోక్షంగా జగన్ కు మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు  బాబు సొంత గ్రామం కూడా మద్దతు ప్రకటిస్తే ఆయన పరువుకు భంగం కలిగే అవకాశం లేకపోలేదు. అమరావతి అంశం అంతా నారావారిపల్లి ప్రజలు మీద ఆధారపడి ఉన్నది. అమరావతికి జై కొడతారో మూడు రాజధానులు కరెక్ట్ అంటారో మరికాసేపట్లోనే తేలిపోతుంది. అయితే టీడీపీ సైతం వైసీపీకి వ్యతిరేకంగా గ్రామంలో ర్యాలీలు, సభలు ఏర్పాటు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: