ఈ కాలంలో ఉన్న మనుషుల్లో ఈ మనుషులు వేరయా. అన్నట్లుగా ఉంది. ఇక్కడ మనం చెప్పుకోబోయే మ్యాటర్.. అదేమంటే ఎవరికైనా కోపం వచ్చినా, అలిగినా, లేదా ఇతర ఘటనలు ఏమైనా జరిగినా అలిగి మాట్లాడకుండా ఒకరోజు లేదా, రెండురోజులు మాట్లాడకుండా ఉంటారు. మరీ కాకపోతే ఒక నెలరోజుల వరకు మాట్లాడుకోరు. కాని కొన్ని రోజుల తర్వాత ఏదో ఒక సంధర్భంలో మాటలు కలుస్తాయి. ఇది మామూలే గాని ఇక్కడ మీకు ఒక వింత ఫ్యామిలీని పరిచయం చేయబోతున్నా ఇంతకు వీరిగురించి ఎందుకు చెప్పవలసింది అంటే వీరికి వీరుగా సమాజం నుండి దూరంగా బ్రతుకుతున్నారు.

 

 

అదెలా అంటే ఎవరితోనూ గొడవపడకుండా ఏళ్ల తరబడి ఎవరితోనూ మాట్లాడకుండా తమ జీవితాన్ని గడుపుతున్నారు.. ఇక విజయనగరం జిల్లా బొబ్బిలిలో వెలుగుచూసిన ఈ వింత ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. బొబ్బిలిలో స్దానికంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నా ఈసపు ఈశ్వరరావు అనే వ్యక్తి, అతని కుటుంబం కొన్నేళ్లుగా వింతగా ప్రవర్తిస్తోంది. ఆ ఇంట్లో ఉన్న నలుగురు తప్పితే, వీరు మిగతా వారితో మాట్లాడటం లేదు. ఎప్పుడు ఇంట్లోనే గడియపెట్టుకుని ఉంటున్న వీరు, ఎవరినీ లోపలకు రానీయరు. తాము పక్క వారితో కూడా మట్లాడరు. తెలిసిన వారు కనిపించినా పలకరించరు.

 

 

ఒక వేళ ఎవరైనా పలకరించినా స్పందించరు. ఇలా స్థానికులతోనే కాదు.. బంధువులతోనూ సంబంధాలను కట్ చేసుకుని నిర్జీవంగా నాలుగేళ్లుగా బతుకుతున్నారు. పిల్లలిద్దరిని స్కూల్‌కు కూడా మానిపించారు..స్థానికంగా వీరి వింత ప్రవర్తన విస్తృత చర్చకు దారితీయడంతో, అధికారులు, మీడియా ప్రతినిధులు వెళ్లి పలకరించినా, కౌన్సిలింగ్‌ ఇప్పించినా లాభం లేకపోయింది. అయితే మీడియా ప్రతినిధులకు మాత్రం సమాధానం చెబుతూ, సీఎం జగన్ తనకి ఛాన్సిస్తే... తమ జిల్లా పాలన అంతా తానే చూస్తానంటున్నాడట ఈశ్వరరావు.

 

 

ఇదే కాకుండా ఏపీలో విద్యా విధానం బాగా లేదని, ఫీజులు తగ్గించాలని, అమ్మఒడి వంటి కార్యక్రమాలు కార్పొరేట్ స్కూల్స్ కి ఎందుకంటూ పొంతనలేని వాదనలు వినిపించాడు. ఇక ఈ మ్యాటర్ కాస్త పోలీసుల దృష్టికి వెళ్లడంతో, అక్కడికి చేరుకున్న పోలీసులు, అధికారులు... ఈ దంపతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా తిరస్కరించారు.. కనీసం పిల్లలను స్కూల్ కి పింపించాలని ఒప్పించగా, మొదట ససేమిరా అన్న ఆ భార్యాభర్తలు... చివరికి పిల్లలను స్కూలుకు పంపేందుకు ఒప్పుకున్నారు... ఈ విషయం తెలిసిన వారు ఇది మానసిక వ్యాధని అంటున్నారు.. ఏది ఏమైనా ఇలా జీవించడం మాత్రం చాలా ప్రమాదకరం. ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని అనుకుంటున్నారు కొందరు.. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: