ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు కామనే. అందులో పోలీస్ ఉద్యోగులకు మరి ఎక్కువ.. ఈ ఉద్యోగం చేస్తున్నంత కాలం అలా ఊర్లుపట్టుకుని తిరగవలసిందే.. ఇకపోతే ఇప్పుడు తెలంగాణాలో ఒక వార్త హట్‌టాపిక్‌గా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. అదేమంటే, ఒకే డిపార్ట్‌మెంట్‌కు సంబంధిచిన ఉద్యోగులను ఒకరో ఇద్దరినో బదిలీ చేస్తారు. కాని తాజాగా ఒకేసారి 50 మంది ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిన్న అంటే ఫిబవ్రరి 2వ తారీఖున, రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణాలో ఇంత భారీ సంఖ్యలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు జరగడం ఇదే తొలిసారి. అందునా రాష్ట్రంలో రెండోసారి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జరగడం చర్చకు దారి తీస్తుంది...  

 

 

ఇకపోతే రాష్ట్రంలో అన్ని రకాల ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులతో కొత్త జట్టుకు రూపకల్పన చేసుకుంది. ఇందుకు గాను ఒకేసారి 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. ఇక బదిలీల్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ కు కీలకమైన నీటిపారుదల శాఖ అప్పగించింది.. ఇక మిగతా శాఖల విషయానికి వస్తే, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న జగదీశ్వర్‌ను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. జీఏడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అధర్‌ సిన్హాను పశు సంవర్ధక శాఖకు ట్రాన్స్‌ ఫర్‌ చేసింది. గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న చిత్రా రామచంద్రన్‌కు విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించింది.

 

 

ఇక పురపాలక శాఖ డైరెక్టర్‌ టీకే శ్రీదేవి, మహబూబ్‌నగర్‌ జిల్లా కలెక్టర్‌ రొనాల్డ్‌ రోస్‌ ను ఆర్థిఖ శాఖ ముఖ్య కార్యదర్శులుగా నియమించగా, సీఎం కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియాకు పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు లభించాయి. వికాస్‌ రాజ్‌ ను మరో కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడగా, విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌ రెడ్డికి వ్యవసాయ శాఖ లభించింది.. అలాగే ఏడాదిన్నరగా పోస్టింగ్ ల కోసం ఎదురు చూస్తున్న 16 మంది సబ్‌ కలెక్టర్లకు పోస్టింగ్ లు ఇచ్చారు. వారందరినీ ఐటీడీఏ పీవోలు, మున్సిపల్‌ కమిషనర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. ఏది ఏమైనా తెలంగాణాలో ఇంత పెద్ద మొత్తంలో బదిలీలు జరగడం ఇదే మొదటిసారి..

మరింత సమాచారం తెలుసుకోండి: