పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా  తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనా...  అంతకుమించిన అభిమానాన్ని... సంపాదించి అభిమానులందరికీ పవర్ స్టార్ గా మారాడు. కేవలం సినిమాలలోనే కాకుండా వ్యక్తిత్వంతో కూడా పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానాన్ని చూరగొన్నాడు. పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా అభిమానించడం కాదు ఆరాధిస్తారు. పవన్ కళ్యాణ్ చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ... పవన్ కళ్యాణ్ సినిమాల్లో  బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన సినిమాలు కూడా కొన్ని అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం... బ్లాక్ బస్టర్ హిట్ సాదించిన హీరోలకు ఉన్న అభిమానులకు మించే  ఉన్నారు. సినిమా హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిలు  రోజురోజుకు పెరిగిపోతునే ఉన్నారు. పవన్ కళ్యాణ్ సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు అనడంలో సందేహం లేదు. 

 

 

 ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే బాలీవుడ్ బాద్ షా అంటారు అభిమానులు .. దర్శక నిర్మాతలు అందరూ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి క్యూ కడుతుంటారు. అటు పవన్ కళ్యాణ్ సినిమాలు  కూడా ఎలాంటి వల్గారిటీ లేకుండా... ఫ్యామిలీ ఎంటర్ టైనర్  సినిమాలే ఉండడంతో... ఫ్యామిలీ  ఆడియన్స్ కూడా పవన్ కళ్యాణ్ ను  అభిమానిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ సినిమాలో డైలాగ్ చెబుతున్నాడు అంటే అభిమానులు ఎంతో మురిసి పోతూ ఉంటారు... సినిమాలలో విలన్లను  చితక్కొడుతూ  యాక్షన్ సీన్లు ఇరగదీసాడు అంటే... సినిమా చూస్తున్న అభిమానులందరూ హోరెత్తిపోతునే  ఉంటారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ కి ఫిదా అవ్వక మారరు. 

 

 

 ఇక పవన్ కళ్యాణ్ హీరోయిన్లతో చేసే చిలిపి చేష్టలు... సినిమాల్లో చేస్తే చిన్న చిన్న స్టెప్పులే ... ఎంతో స్టైల్గా కనిపిస్తూ ఉంటాయి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ చిలిపి నవ్వు నవ్వాడు అంటే.. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యే  అభిమానులు ఎంతో మంది . మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్బై చెప్పేసి రాజకీయాల్లోకి వెళ్లి సినిమా అభిమానులను కాస్త హర్ట్  చేసినప్పటికీ తాజాగా మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ సినీ అభిమానుల్లో సరికొత్త జోష్ నింపారు. ఇక  పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పవన్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: