తెలుగు సినిమాపై ట్రెండ్ సెట్టింగ్ డాన్స్, ఫైట్స్, యాక్షన్ తో చిరంజీవి నట ప్రస్థానం ఓ చరిత్ర. వరుస హిట్లు, అప్రతిహతమైన క్రేజ్, విపరీతమైన ఫ్యాన్ బేస్ తో తెలుగు సినిమాపై చెరగని ముద్ర వేశాడు. ఎన్టీఆర్ తర్వాత అంతటి మాస్ ఇమేజ్ ను, క్రేజ్ ను, స్టార్ డమ్ ను, నెంబర్ వన్ స్థానాన్ని మెగాస్టార్ గా చిరంజీవి సాధించాడు గానీ.. చిరంజీవి సాధించిన వీటన్నింటినీ మాత్రం ఈ జనరేషన్ లో మరే హీరో కూడా అందుకోలేకపోయారనేది వాస్తవం.

 

 

అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి చాలా పెద్ద తప్పే చేశాడు. రాజకీయాల్లో ఏర్పడ్డ మచ్చను చిరంజీవి చెరుపుకోలేనిది. మళ్లీ సినిమాల్లోకి వస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారనే సందేహం కూడా చిరంజీవికి వచ్చిందంటే.. రాజకీయంగా ఎంతటి బ్యాడ్ పిరియడ్ చూశాడో అర్ధమవుతోంది. అయితే.. చిరంజీవికి ఉన్న అదృష్టం.. రాజకీయాల్లో ఆయనను అంగీకరించని ప్రజలు తిరిగి సినిమాల్లోకి వస్తే మాత్రం.. ఆయన్ని మళ్లీ పల్లకీలో మోశారు. వరుసగా రెండు సినిమాలు వంద కోట్ల క్లబ్ లో చేర్చి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో నువ్వే అని చాటిచెప్పారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లాడనే విషయాన్నే పక్కనబెట్టేశారు.

 

 

అలాంటి చిరంజీవి ‘మళ్లీ కాంగ్రెస్ లో యాక్టివ్ అవబోతున్నారు..’ అని కాంగ్రెస్ ఏపీ కొత్త అధ్యక్షుడు శైలజానాధ్ ప్రకటించడం మాత్రం చిరంజీవి హార్డ్ కోర్ అభిమానులకు, ప్రేక్షకులకు రుచించటం లేదు. గతానుభవాల దృష్ట్యా చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లకపోవడమే ఉత్తమమని అందరి భావన. ఫ్యామిలీ హీరోలను గైడ్ చేస్తూ తాను సినిమాలు చేస్తూ ప్రజలను అలరిస్తూ ఉంటే చిరంజీవికి అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు. డైరక్టర్ సుకుమార్ అన్నట్టు.. ‘మెగాస్టార్ కంటే పెద్ద పదం.. పెద్ద స్థాయి ఇంకోటి ఉంటుందనుకోను’ అనేది ఎంతైనా విలువైన మాట. మరి మెగాస్టార్ ఆలోచన ఎలా ఉందో.

మరింత సమాచారం తెలుసుకోండి: