దిశ ఘటన.. ఇంకో పదేళ్లు అయినా ఈ ఘటన గుర్తొస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అలాంటి దారుణమైన ఘటన ఇది. నలుగురు కామాంధులు వెటర్నరీ డాక్టర్ అయినా దిశను దారుణంగా సామూహిక అత్యాచారం చేసి సజీవదహనం చేశారు. అయితే దేవుడు ఉండటం వల్ల ఆ నలుగురు పోలీసులకు దొరికారు. 

 

దీంతో ఆ నలుగురిని హై కోర్టు 14 రోజులు రిమాండ్ కు తరలించగా వారిని పోలీసులు విచారణలో భాగంగా దిశ ఘటన జరిగిన స్థలానికి ఆ నలుగురిని రీకంస్ట్రక్షన్ కోసం తీసుకెళ్లగా ఆ నలుగురు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆ నలుగురిపై పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. 

 

అయితే వారి శవాలను పోస్టుమార్టం.. రీపోస్టుమార్టం అంటూ ఎన్నో పరీక్షలు చేసి ఎట్టకేలకు వారి అంత్యక్రియలు చేశారు.. అయితే ఆ ఎన్ కౌంటర్ పై ఇప్పటికి కోర్టులోవిచారణ జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మరో ఘట్టానికి చేరింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు నియమించిన జ్యుడీషియల్‌ కమిటీ హైదరాబాద్‌కు చేరుకుంది. 

 

ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల గురించి జ్యూడిషయల్ కమిటీ ఆరా తీస్తూ.. నిందితుల పోస్టుమార్టం రిపోర్టు, రీ పోస్టుమార్టం నివేదికలను కమిటీ పరిశీలించనుంది. అంతేకాదు.. ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ నుంచి వివరాలు సేకరించనున్నారు. అయితే హైకోర్టు వేదికగా కమిటీ దర్యాప్తు కొనసాగనున్న నేపథ్యంలో సీఆర్పీఎఫ్‌ బలగాలతో ప్రభుత్వం వీరికి భారీ భద్రతను ఏర్పాటు చేసింది. 

 

కాగా నిన్ననే ఎన్కౌంటర్ కు గురైన దిశ నిందితుడు చెన్నకేసువులు భార్య రేణుకను.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలిసి ఇంటర్వూ చేసిన సంగతి తెలిసిందే.. అంతేకాదు..  ఒక అమ్మాయిని రేప్ చేసి.. 16 ఏళ్ళ పాపను పెళ్లి చేసుకొని.. ఇప్పుడు ఆ అమ్మాయి మరో బిడ్డకు జన్మనిచ్చేలా చేస్తున్నాడు అంటూ రామ్ గోపాల్ వర్మ ఈ ఘటనపై ఎమోషనల్ ట్విట్ పెట్టిన సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: