విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2014 ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆర్థికంగా మరియు అదే విధంగా రాజధాని లేని 13 జిల్లాలతో మిగిలి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు సీఎం అవ్వటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. కాగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో  చాలా కుయుక్తులు పన్ని ఒక ఉద్దేశపూర్వకంగా తన పార్టీ వారికి మరియు తన బినామీలకు తన సామాజిక వర్గానికి చెందిన వాళ్లకి మేలు చేయాలని ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి అమరావతి రాజధానిగా ప్రకటించకు ముందు తన వారి చేత భూములు కొనటం జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ పార్టీ ఆరోపించడం జరిగింది.

 

అయితే తాజాగా వైసీపీ పార్టీ అధికారంలోకి రావడంతో చంద్రబాబు హయాంలో అమరావతి భూముల విషయంలో జరిగిన భూ కుంభకోణాన్ని బయట పెట్టడానికి రెడీ అయింది. ఇప్పటికే వికేంద్రీకరణ పేరిట 3 రాజధానులను తెరపైకి తీసుకువచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి చెందాలని...అభివృద్ధిలో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా భాగస్వామ్యులు కావాలని జగన్ కోరడం జరిగింది. ఇదే క్రమంలో మరో పక్క అమరావతి ప్రాంతంలో జరిగిన భూ దోపిడీ విషయంలో Cid మరియు ఈడీ సంస్థల చేత దర్యాప్తు చేయడానికి రెడీ అయిన విషయం అందరికీ తెలిసినదే.

 

ఇటువంటి నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో చంద్రబాబు హయాంలో 720 ఎకరాలు తెల్ల రేషన్ కార్డు దారులు కొనుగోలు చేయటాన్ని సిఐడి గుర్తించింది. దీంతో మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. గతంలో సిఐడి ఈ విషయాన్ని ఈడీ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. దీంతో ఈ డి కూడా ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ కింద కేసు నమోదు కేసు నమోదు చేయడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు దారులు దాదాపు కొన్ని వందల కు పైగా భూములను ఇక్కడ కొనుగోలు చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతో ఈ విషయం ఇప్పుడూ ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: