తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన దగ్గర నుంచి రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందుల్లో పడిపోయింది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రత్యర్ధి పార్టీలతో కూటమి ఏర్పాటు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ దాదాపు అయిపోయింది అనుకుంటున్న సమయంలో ఎవరో ఒకరు మళ్లీ పార్టీలో యాక్టివ్ అవుతూ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దాని ఫలితం అంతంత మాత్రంగానే ఉన్నా ... కాంగ్రెస్ ఉనికి కోల్పోకుండా మాత్రం కాపాడుకోగలుగుతోంది. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరులు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు మళ్లీ ఊపిరి పోసే విధంగా వ్యవహరిస్తున్నారు.

 


 కొద్ది రోజుల క్రితం జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా దెబ్బతింది. అయితే తాము దెబ్బతిన్నా తమ రాజకీయ ప్రత్యర్ధులుగా మారుతూ బలపడేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి తెలంగాణలో బలం లేదు అని నిరూపించే విధంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ తారుమారు చేయగలిగింది. నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ జిల్లాలో మొత్తం 18  మున్సిపాలిటీలు ఉండగా వాటిలో ఒకటి మాత్రమే కాంగ్రెస్ గెలుచుకుంది. అయితే నేరేడుచర్ల, హాలియా, నల్గొండ, చౌటుప్పల్, యాదగిరిగుట్టలో మాత్రం టిఆర్ఎస్ కు ధీటుగా కౌన్సిలర్ లను గెలిపించుకుని కోమటిరెడ్డి బ్రదర్స్ తమ సత్తా చాటుకున్నారు.

 


 ఈ జిల్లాలో మున్సిపాలిటీలో గెలిస్తే టిఆర్ఎస్ ఆశలకు కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద గలిగారు. ఈ జిల్లాలోనే కాకుండా... తెలంగాణ మొత్తం కోమటిరెడ్డి బ్రదర్స్ తమ హావ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక మొన్నటి వరకు ఉదృతంగానే సాగింది. మూడు రాజధానులతోపాటు నేరేడుచర్ల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పిసిసి అధ్యక్షులు ఉత్తంకుమార్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్న ఈ మున్సిపాలిటీని కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఓడిన తర్వాత మున్సిపల్ ఎన్నికలను ఛాలెంజ్ గా తీసుకున్న ఉత్తమ్ ఇక్కడ టీఆర్ఎస్ దుర్మార్గాలకు పాల్పడుతోంది అంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. కలెక్టర్ ను బదిలీ చేయాలని కూడా తెరమీదకు తీసుకువచ్చారు. 

 

 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన టీఆర్ఎస్ కౌన్సిలర్ల ను  ఆయన తప్పు పట్టారు. ఈ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి సిపిఎం పార్టీ కార్యాలయం పైన దాడికి కూడా ప్రయత్నించారు. ఇక భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదేవిధంగా వ్యవహరిస్తూ తన పరపతిని పెంచుకునే విధంగా ప్రయత్నిస్తున్నారు. యాదగిరిగుట్టతో పాటు ఆదిభట్ల,పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి టీఆర్ఎస్ పై ఆధిపత్యం ప్రదర్శించేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ స్థాయిలో దూకుడు ప్రదర్శించే నాయకులుగా కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయం చేస్తుండటంతో కాంగ్రెస్ లో కొంత ఉత్సాహం కనిపిస్తున్నట్టు గా అనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: