తెలంగాణలో దాదాపుగా ఉనికి కోల్పోయిన తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకునేందుకు, పునర్వైభవం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఆ పార్టీకి పెద్దగా కలిసి రావడంలేదు. అయినా పుంజుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. ఇటువంటి కీలక సమయంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న శంషాబాద్ కీలక నాయకుడు గణేష్ గుప్త తో పాటు మరికొంతమంది కీలక నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం తో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. తెలంగాణలో టీడీపీకి కొత్త ఉత్సాహం తెచ్చేందుకు అధ్యక్షురాలిగా నందమూరి సుహాసినిని అధ్యక్షురాలిగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు కొద్ది రోజులుగా వస్తున్నాయి. 


ఇదే సమయంలో నాయకులు ఒక్కొక్కరు ఇలా బయటకు వచ్చేస్తుండడం మరింతగా ఆ పార్టీని కలవరపెడుతోంది. చాలా కాలంగా గణేష్ గుప్తాను టిఆర్ఎస్ లోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఆయన చేరకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ వచ్చారు. అయితే ఇక భవిష్యత్తులోనూ టిడిపి తెలంగాణలో పుంజుకునే అవకాశం కనిపించకపోవడంతో ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో తన అనుచరులతో కలిసి టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ను ఎదుర్కొనే సత్తా లేక రెండు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలు ఏకమయ్యాయి అంటూ విమర్శించారు. 


ఎవరు ఎన్ని కుతంత్రాలు పన్నినా... తెలంగాణ ప్రజలు తమ వైపే ఉన్నారని, దీనికి తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలే నిదర్శనం అంటూ ఆయన చెప్పారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో 11 మంది ఆర్యవైశ్యులను మున్సిపల్ చైర్మన్లు అయ్యారని, అన్ని వర్గాలకు సమానంగా న్యాయం చేసే ఏకైక పార్టీ టిఆర్ఎస్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. టిఆర్ఎస్ ఎన్నికల్లో గెలవడానికి కార్యకర్తలు గట్టిగానే కృషి చేశారని,  కాంగ్రెస్ , బీజేపీలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. చెప్పుకోవడానికి బిజెపి కేంద్ర అధికార పార్టీ అయినా తెలంగాణ విషయంలో ఆ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, అయినా రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు ఎవరు నోరు మెదప లేకపోతున్నారు అంటూ కేటీఆర్ విమర్శించారు

మరింత సమాచారం తెలుసుకోండి: