గిరిజనుల ఆరాధ్య వన దేవతలై సమ్మక్క సారలమ్మల మేడారం జాతర అత్యంత వైభవంగా మండమెలిగే పండుగతో ప్రారంభమైంది. ఈ పండుగ నాలుగు రోజుల పాటు సాగుతుంది. సమ్మక్క సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో మండ మెలిగే పండుగను ఘనంగా నిర్వహిస్తారు. అయితే  మేడారం జాతరకు ములుగు, వరంగల్‌, భూపాలపల్లి, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల నుండే కాకుండా ఛత్తీష్‌గడ్‌, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. మేడారం జాతర సంధర్బంగా భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు గాను అన్ని ఏర్పాట్లు చేశారు. 

 

జాతర సందర్బంగా భుక్తులకు సౌకర్యవంతగా ఉండేందుకు గాను తాగునీటి చేతిపంపులు, జంపన్న వాగులో స్నాన ఘట్టాల వద్ద  షవర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ శాఖ అధికారులు  ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయగా 100 మందికి పైగా పారుశుద్ద కార్మికులను అధికారులు ఏర్పాటు చేశారు. జాతరలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా సుమారుగా అధిక సంఖ్య‌లో పోలీసులను పర్యవేక్షణలో పెట్టారు. కోయ గిరిజనుల ఉనికికోసం పోరాడి వీర మరణం పొందిన సమ్మక్క-సారలమ్మ జాతర ఓరుగల్లును పాలించిన ప్రతాపరుద్రుడు కాలం నుంచి కొనసాగుతున్నట్లు స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని పడిగిద్దరాజు పరిపాలించేవారు. 

 

ఇక ఇదిలా ఉంటే...సమ్మక్క - సారక్క లను భక్తులు కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, ఆపదలో ఉన్న వారిని ఆడుకొనే ఆపద్భాంధవులుగా, వనదేవతలుగా పూజిస్తారు. వ‌న‌దేవ‌త‌లు స‌మ్మ‌క్క‌-సార‌ల‌మ్మ‌కు కొలిచే మేడారం జాత‌ర‌లో మ‌రో ప్ర‌త్యేకమైన అంశం ఏమిటంటే.. మందూ మాంస‌మే ఈ జాత‌రు స్పెష‌ల్ అని చెప్పాలి.  అమ్మ‌వార్ల‌ను ద‌ర్శించుకున్న త‌ర్వాత జ‌నం తెగ ఎంజాయ్ చేస్తారు. మాములుగా కాదు ఎంత‌లా అంటే మందు, విందు, చిందు అంటూ... అభ‌యార‌ణ్యంలో చెట్ల‌కింద వంట‌లు చేసుకుంటారు. మందూమాంసాహారంతో హాయిగా గ‌డుపుతారు. జాత‌ర‌లో ఎన్ని ల‌క్ష‌ల యాట‌పోతులు, కోళ్లు తెగుతాయో అంచ‌నా వేయ‌డం అంత సుల‌భం కాదుమ‌రి.

మరింత సమాచారం తెలుసుకోండి: