నేడు మంగళగిరి లో జరిగిన ప్రెస్ మీట్ లో మన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారా అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయంలో బాబు అటు రాష్ట్ర ప్రజలతో పాటు ఇటు టిడిపి కార్యకర్తలను కూడా నిరాశ పరిచాడు. జగన్ మండలిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కొన్ని రోజులు అసలు అడ్రెస్ లేకుండా ఉన్న బాబు ఒక్కసారిగా అమరావతి రైతుల గురించి ప్రెస్ మీట్ పెట్టడంతో చంద్రబాబు ఏదో కొత్త విషయం తెర మీదకు తీసుకువస్తాడు అని ఆశించిన వారందరికీ తనదైన స్టైల్ లో నిరాశ మిగిల్చాడు.

 

చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంపై ఉందని మరియు మాకెందుకులే అనుకుంటే నష్టపోయేది చివరికి ప్రజలే అని అన్నారు. ప్రజల మాకెందుకులే అని అనుకొని ఉంటే విద్యార్థులతో పాటు మహిళలు కూడా వచ్చి అతని పరిపాలనలో ప్రత్యేక హోదా గురించి ధర్నా చేసే వారు కాదు అని చంద్రబాబు గుర్తుంచుకోవాలి. ఇకపోతే అమరావతి అందరి బాధ్యత అని చంద్రబాబు చెబుతున్న నేపథ్యంలో ఆయన అమరావతి ప్రజల వైపు ఎందుకు అంత ప్రేమ ఒలకబోస్తున్నాడో రాష్ట్రానికి మొత్తం తెలిసిందే.

 

ఇక అన్నిటికన్నా హాస్యాస్పదంగా అనిపించిన విషయం ఏమిటంటే.. చంద్రబాబు అమరావతి పై తమకు అనుకూలంగా రాసిన మీడియా పై కొంత మంది కుల ముద్ర వేస్తున్నారు అని చెప్పడం. ప్రజలంతా రాష్ట్రంలో పచ్చ మీడియా అనేది ఒకటి ఉందని అది ఎప్పుడు పిచ్చి రాతలు రాస్తోందని ఎలా చెప్పుకుంటారో బాబు గారు తెలియనట్టే ప్రేస్ మీట్ లో మాట్లాడారు. ఇకపోతే జాతీయ మీడియాలో జగన్ పై మరియు అతని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయని మరియు వారు రాసే కథనాలలో సామాజిక బాధ్యత కనిపిస్తుందని అనడం అందరినీ విస్మయపరిచింది.

 

జాతీయ మీడియాలో జగన్ ప్రభుత్వం పై వస్తున్న విమర్శలతో రాష్ట్రం పరువుపోతుంది అని చంద్రబాబు చెప్పడం చూసి అదే మీడియా అతను స్పెషల్ స్టేటస్ కోసం వేసిన డ్రామాలు మరియు తీసుకున్న యుటర్న్ గురించి ప్రస్తావించినప్పుడు రాష్ట్రం పరువు పోలేదా అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మన రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలు మన కన్నా జాతీయ మీడియాకే బాగా తెలుసు అని ఆయన అనడం వెనుక అంతరార్ధం ఏమిటో తెలియక అక్కడ హాజరైన వారంతా తలలు పట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: