ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడకు సీబీఐ ఉచ్చు బిగుసుకోనుందా ?, ఆ దిశగా కేంద్రంపై వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఒత్తిడి పెంచుతున్నారా ?? అంటే అవుననే వాదనలు విన్పిస్తున్నాయి . రాజధాని అమరావతి భూముల కొనుగోలు వ్యవహారం లో వెలుగు చూసిన అక్రమాల వెనుక చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉన్నదని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు .  అమరావతి భూముల కొనుగోలు వ్యవహారాన్ని  నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని , లోక్ సభ లో మిథున్ రెడ్డి  కేంద్రాన్ని  కోరడం , సీఐడీ కోరిక మేరకు ఈడీ రంగం లోకి దిగడం వంటి పరిణామాలను పరిశీలిస్తే , కేంద్రం సీబీఐ  విచారణకు ఆదేశించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది .

 

కృష్ణా జిల్లా తిరువూరు లో రాజధాని వస్తుందని తొలుత ప్రకటించిన గత ప్రభుత్వం , మూడు నెలల అనంతరం మాట మార్చి కృష్ణా , గుంటూరు జిల్లాల మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని  మిథున్ రెడ్డి గుర్తు చేశారు . ఈ మధ్యకాలంలోనే టీడీపీ నేతలు తమ కుటుంబ సభ్యుల పేరిట , బినామీల పేరిట భూములు కొనుగోలు చేశారని అన్నారు . రాజధాని అమరావతి భూకొనుగోలు వ్యవహారం పై వైస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెల్సిందే . సీఐడీ దర్యాప్తు లో భాగంగా  780 మంది తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న వ్యక్తులు రాజధాని ప్రాంతం లో భూములు కొనుగోలు చేసినట్లు తేలింది .

 

అయితే వీరంతా కోట్ల రూపాయలు వెచ్చించి ఎలా భూములు కొనుగోలు చేశారన్నది నిగ్గు తేల్చేందుకు ఈడీ విచారణను సీఐడీ కోరడం , ఈడీ అంగీకరించడం చకచకా జరిగిపోయాయి . దీనితో రాజధాని అమరావతి ప్రాంతం లో బినామీల పేరిట భూములు కొనుగోలు చేసిన వారి పీఠాలు కదులుతున్నాయి .   

మరింత సమాచారం తెలుసుకోండి: