తెలంగాణ లో కేసీఆర్ కుమార్తెగానే కాకుండా తనకంటూ సొంతంగా ఇమేజ్ సంపాదించుకున్న మాజీ ఎంపీ కవిత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందిన తరువాత నుంచి పెద్దగా పొలిటికల్ గా యాక్టివ్ గా కనిపించడంలేదు. పార్టీ కార్యక్రమాలకు కూడా ఆమె దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు టీఆర్ఎస్ లో బాగా కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన ఆమె బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చెందారు. ఇక అప్పటి నుంచి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ యాక్టివ్ అవ్వడంతో పాటు అరవింద్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందిగా కవిత రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్నారు. 


ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి కవిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కూడా సక్రమంగా జరగకపోవడంతో టీఆర్ఎస్ కు చేదు ఫలితాలు ఎదురయ్యాయని ఆ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ఆర్మూర్, మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ తరువాత స్థానంలో బీజేపీ ఉంది. అదే కవిత కనుక ప్రచారానికి వస్తే ఫలితం ఇంకా మెరుగ్గా ఉండేదని టీఆర్ఎస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.  


నిజామాబాద్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. 60 వార్డుల్లో కనీసం 30 వార్డు ల్లో గెలుపు ఖాయం అని భావించినా కేవలం 13 స్థానాలకు పరిమితం అయిపోవడాన్ని టీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోతోంది. కవిత కనుక ప్రచారానికి దిగి ఉంటే తన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న ధర్మపురి అరవింద్ తో పాటు బీజేపీ పైనా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసి వారి హవాను తగ్గించి ఉండేవారని, ఆమె ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడంతో ఆ ప్రభావం టీఆర్ఎస్ ఫలితాలపై స్పష్టంగా కనిపిస్తోందని వారు వాపోతున్నారు. ముఖ్యంగా పసుపు బోర్డు ఏర్పాటు చేసి రైతులకు మేలు చేస్తానని ఎన్నికల వాగ్దానం చేసిన అరవింద్ ను గట్టిగా నిలదీసి ఉండేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: